కరోనా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్లో సంభాషించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వ్యాక్సిన్ ముడి పదార్థాలు, ఔషధాల రవాణా సాఫీగా జరగటంపై ప్రధానంగా చర్చించినట్లు మోదీ తెలిపారు. బైడెన్‌తో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని పేర్కొన్నారు.
"అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఈరోజు ఫలప్రదమైన సంభాషణ జరిగింది. ఇరు దేశాల్లోని కొవిడ్ పరిస్థితులపై మేం సవివరంగా చర్చించాం. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు అన్ని రకాలుగా సాయం అందిస్తామని ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. వ్యాక్సిన్ ముడిపదార్థాల రవాణా సాఫీగా జరిగడంపై మేం ప్రధానంగా చర్చించాం. ప్రపంచానికి సవాలు విసురుతున్న కొవిడ్ మహమ్మారిని అమెరికా, భారత్ ఆరోగ్య భాగస్వామ్యం దీటుగా ఎదుర్కోగలవు."
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అంతకుముందు.. కరోనా మహమ్మారితో ధైర్యంగా పోరాడుతున్న భారత్‌కు అన్నిరకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. "గతంలో కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికాకు భారత్ ఆపన్నహస్తం అందించింది. అలాగే మేము కూడా ఇప్పడు భారత్‌కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం." అని ట్విట్టర్ వేదికగా బైడెన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్‌కు సహకరించాలని పెంటగాన్‌కు ఆదేశాలు