ప్రపంచ ఇంధన రాజధానిగా చెప్పే హ్యూస్టన్ నగర తాళం... ప్రధాని నరేంద్రమోదీ చేతికి అందింది. ఆ నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్ స్వయంగా హ్యూస్టన్ తాళాన్ని నరేంద్రుడికి అందజేశారు.
టెక్సాస్ హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరుగుతున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా కాంగ్రెస్ చట్టసభ్యులతోపాటు నగర మేయర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
మోదీకి హ్యూస్టన్ నగర ప్రజల తరఫున టర్నర్ సాదర స్వాగతం పలికారు. ఇంధన రంగంలో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని సూచిస్తూ... ఇలా తాళాన్ని మోదీ చేతికి అందించారు.
"హ్యూస్టన్లో మేము 140కిపైగా భాషల్లో హౌడీ అంటాము. ఇప్పుడు మోదీతో హౌడీ అని చెబుతున్నాము."
-సిల్వస్టర్ టర్నర్, హ్యూస్టన్ మేయర్.