ETV Bharat / international

నెలాఖరుకు మోడెర్నా టీకా ఫలితాలు!

మోడెర్నా కొవిడ్ టీకా ఫలితాలు ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రాథమిక విశ్లేషణ తర్వాత వ్యాక్సిన్ ప్రభావం ఫలితాలు వెల్లడించనున్నట్లు ఆ సంస్థ బుధవారం తెలిపింది.

first analysis of Moderna vaccine
మోడార్నా కొవిడ్ వ్యాక్సిన్ ఫలితాలు
author img

By

Published : Nov 12, 2020, 3:24 PM IST

కొవిడ్ నియంత్రణకు అమెరికాకు చెందిన మోడెర్నా తాము అభివృద్ధి చేసిన టీకా ప్రయోగాల ఫలితాలను.. పూర్తి డేటాను విశ్లేషించి త్వరలోనే ప్రకటించనున్నట్లు బుధవారం తెలిపింది.

మోడెర్నా 30 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్​ నిర్వహిస్తోంది. ఇందులో సగం మందికి వ్యాక్సిన్ ఇస్తుండగా.. మిగతా సగం మందికి ప్లాసిబో(ఎలాంటి ప్రభావం చూపని సెలైన్ లాంటి పదార్థం) అందిస్తున్నారు.

ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో కనీసం 53 మంది కరోనా బారిన పడితే.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ) వ్యాక్సిన్​ను పరిగణనలోకి తీసుకుంటుంది.

అయితే మోడెర్నా ట్రయల్స్​లో బుధవారం నాటికి 53 మందిలో ఈ ప్రభావం కనిపించింది. జబ్బు పడిన వారు వ్యాక్సిన్ తీసుకున్నవారా? ప్లాసిబో తీసుకున్నవారా? అనే విషయంపై మోడెర్నాకు ఇంకా స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో 'డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్​'కు ట్రయల్స్​ డేటాను పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది మోడెర్నా. ఇందులో ఎక్కువ మంది ప్లాసిబోను తీసుకున్నవారు అని తేలితే వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:కరోనా వైరస్​లో కొత్త జన్యువు- గుర్తించిన శాస్త్రవేత్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.