ETV Bharat / international

ఆ అదృష్టజాతకుడికి లాటరీలో వందకోట్ల డాలర్లు - మిషిగన్​ లాటరీలో వందకోట్ల డాలర్లు

లాటరీలో కోటి రూపాయలు వస్తేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది ఏకంగా వంద కోట్ల డాలర్లు జాక్​పాట్​ కొట్టాడు అమెరికాలో ఓ వ్యక్తి. అమెరికా చరిత్రలో ఇదే మూడో అతిపెద్ద లాటరీ.

Michigan lottery
లాటరీలో వందకోట్ల డాలర్లు
author img

By

Published : Jan 24, 2021, 10:01 AM IST

అమెరికాలో ఓ అదృష్టజాతకుడు మిషిగన్​ లాటరీలో వందకోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అయితే ఈ మొత్తం దాదాపు రూ.7,300 కోట్లు!! వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ!! అమెరికా చరిత్రలో ఇది మూడో అతిపెద్ద లాటరీ.

బహుమతిని దక్కించుకున్న టికెట్​ డెట్రాయిట్​లోని ఓ దుకాణంలో అమ్ముడుపోయినట్లు మిషిగన్​ లాటరీ తెలిపింది. 'ఈరోజు ఉదయం మిషిగన్​లో ఆ అదృష్టజాతకుడు నిద్ర లేవగానే తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చి వేసే వార్త వింటాడు. కొత్త మల్టీ మిలియనీర్​కు శుభాకాంక్షలు.' అని గ్రాసరీ చైన్​ ప్రాంతీయ అధికార ప్రతినిధి రాచెల్​ హార్ట్స్​ వ్యాఖ్యానించారు.

లాటరీ డ్రా తీసేందుకు కేవలం రెండు రోజుల ముందు మేరిలాండ్​లో విజేతకు ఈ టికెట్​ను అమ్మారు. మొత్తం ఆరు నంబర్లు పోల్చిచూడగా అన్నీ కరెక్టుగా ఉండటంతో అతడు జాక్​పాట్​ కొట్టాడు.

ఇదీ చూడండి: బోరిస్​, లోపెజ్​లతో ఫోన్​లో మాట్లాడిన బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.