వీర్యం నింపిన సిరంజీతో ఓ మహిళను పొడిచినందుకు (syringe attack) అమెరికా మేరీల్యాండ్‌లో (US Maryland) ఓ ప్రబుద్ధుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. దోషి ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్(52) (thomas stemen maryland) కాగా.. అతడికి తొలుత 25 ఏళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. తర్వాత పదేళ్లకు కుదించింది. 'ఫస్ట్ డిగ్రీ' దాడి కేసులో పదేళ్లు, సెకండ్ డిగ్రీ దాడిలో ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది. ఈ రెండు ఏకకాలంలో అమలు కానున్నాయి. పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత ఐదేళ్ల పాటు పరిశీలనలో ఉండనున్నాడు.
-
Police arrested Thomas Stemen after he allegedly stuck a woman with a syringe. Police later discovered some of the syringes in his car were filled with semen: https://t.co/NXI6zqis1x pic.twitter.com/WXnmNIeaWI
— WPEC CBS12 News (@CBS12) February 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Police arrested Thomas Stemen after he allegedly stuck a woman with a syringe. Police later discovered some of the syringes in his car were filled with semen: https://t.co/NXI6zqis1x pic.twitter.com/WXnmNIeaWI
— WPEC CBS12 News (@CBS12) February 29, 2020Police arrested Thomas Stemen after he allegedly stuck a woman with a syringe. Police later discovered some of the syringes in his car were filled with semen: https://t.co/NXI6zqis1x pic.twitter.com/WXnmNIeaWI
— WPEC CBS12 News (@CBS12) February 29, 2020
ఏం జరిగిందంటే?
కిరాణా దుకాణంలోకి వచ్చిన మహిళపై నిందితుడు సిరంజీతో దాడి (syringe attack at grocery store) చేశాడు. షాపింగ్ కార్ట్ తీసుకొస్తున్న మహిళకు.. సిరంజీని వెనక నుంచి గుచ్చాడు. జేబులో నుంచి సూదిని తీసి.. తెలియకుండానే తర్వాత లోపల పెట్టేసుకున్నాడు నిందితుడు. ఈ ఘటన 2020 ఫిబ్రవరిలో జరిగింది. తొలుత ఏదో కుట్టిందని భావించిన మహిళ.. నిందితుడిని ఆరా తీసింది. సిగరెట్‌తో కాల్చావా అని ప్రశ్నించింది. దానికి అవునని చెప్తూనే.. అది పురుగు కుట్టినట్టు ఉంటుంది అని నిందితుడు మహిళతో చెప్పాడని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే, అది సిరంజీ దాడి అని, అందులో వీర్యం కలిపాడని తర్వాత తేలింది.
ఇంట్లో ఖాళీ సిరంజీలు
మరో ఇద్దరు బాధితులపైనా సిరంజీ దాడికి యత్నించాడు స్టీమెన్. తన ముందు నడవమని సూచిస్తూ 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్టీమెన్ ఇంటిని తనిఖీ చేయగా.. ద్రవంతో కూడిన ఓ సిరంజీని గుర్తించారు. 9 ఖాళీ సిరంజీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఐదు సిరంజీలకు సూదులు లేవు. దాడి సమయంలో ధరించిన దుస్తులను ఇంటి బయట బాత్రూం వద్ద పడేశాడు.
నిందితుడి ఇంట్లో లభించిన సిరంజీలను డీఎన్ఏ టెస్టుకు పంపారు పోలీసులు. దాడిలో సేకరించిన నమూనాలతో ఈ ఫలితాలను పోల్చి చూడగా.. రెండు సరిపోలాయి. దీంతోపాటు సీసీటీవీ ఫుటేజీ కూడా ఉండటం వల్ల.. నిందితుడికి శిక్షపడేలా చేయగలిగారు పోలీసులు.
ఇదీ చదవండి: