ETV Bharat / international

అగ్నిపర్వతంపై పిజ్జా తయారీ- నెటిజన్లు ఫిదా - డేవిడ్​ గార్సియా పిజ్జా

అగ్నిపర్వతాన్ని ఓ వ్యక్తి తన వంటగదిగా మార్చేశాడు. ఉబికివస్తున్న లావాపై పిజ్జా చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. గ్వాటెమాలాలోని పకాయ అగ్నిపర్వంతపై చేసిన ఈ పిజ్జాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ పిజ్జా విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండీ.

pizza on volcano
అగ్నిపర్వతంపై పిజ్జా
author img

By

Published : May 16, 2021, 1:24 PM IST

పిజ్జా చేయాలంటే.. ఓవెన్​ వాడుతారు ఎవరైనా. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అగ్నిపర్వతాన్నే వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. డేవిడ్​ గార్సియా(34) అనే వ్యక్తి.. గ్వాటెమాలాలోని పకాయ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావాపై పిజ్జా చేస్తూ ఆకట్టుకున్నాడు. దీనికి అగ్నిపర్వతం పేరుతో.. 'పకాయ పిజ్జా'గా నామకరణం చేసి సరికొత్త ట్రెండ్​ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు.

pizza on volcano
అగ్నిపర్వతంపై పిజ్జా
pizza on volcano
లావాపై పిజ్జా వండుతున్న గార్సియా

ప్రత్యేక దుస్తులు ధరించి..

అగ్నిపర్వతంపై పిజ్జాను తయారు చేసేటప్పుడు వేడి నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరించాడు గార్సియా. వంటకు 1,800 ఫారన్​హీట్​ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకునే పాత్రలను వినియోగించాడు. ప్రస్తుతం గార్సియా పిజ్జా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

"దాదాపు 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లావాపై నేను పిజ్జా చేసేందుకు పెట్టాను. 14 నిమిషాల్లో పిజ్జా సిద్ధమైంది. లావా మీద చేసిన ఈ పిజ్జా భలే రుచిగా ఉంటుంది."

-గార్సియా, పిజ్జా మేకర్​

pizza on volcano
పిజ్జా తయారు చేస్తున్న గార్సియా
pizza on volcano
లావాపై తయారవతున్న పిజ్జా

గార్సియా పిజ్జా తయారీ గురించి తెలుసుకున్న పర్యటకులు చాలా మంది పకాయ అగ్నిపర్వతం వద్దకు విచ్చేస్తున్నారు. గార్సియా పిజ్జా చేస్తుండగా చూస్తూ.. ఫొటోలు దిగుతూ మురిసిపోతున్నారు.

మూడు నెలల నుంచి..

ఫిబ్రవరి నుంచే పకాయ అగ్నిపర్వతం లావాను వెదజల్లుతోంది. ఇప్పటికే.. స్థానికులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్​ ప్రకటించారు. పకాయ అగ్ని పర్వతం.. 23,000 ఏళ్ల కిందట మొదటిసారి విస్ఫోటనం చెందింది. గ్వాటెమాలను స్పెయిన్​ తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకు 23 సార్లు విస్ఫోటనం చెందిందని సమాచారం.

ఇదీ చూడండి: హ్యాకర్లతో కుదరని బేరం- పోలీసుల వ్యక్తిగత డేటా లీక్!

ఇదీ చూడండి: హైవేపైనే విమానం అత్యవసర ల్యాండింగ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.