ETV Bharat / international

బైడెన్​ 'శ్వేతసౌధ' బృందంలో సగానికిపైగా మహిళలే - బైడెన్-హారిస్​ శ్వేతసౌధం సభ్యులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ ప్రకటించిన శ్వేతసౌధం టీంలో 61 శాతం మహిళలు, 54 శాతం మంది నల్ల జాతీయులు ఉన్నారని బైడెన్​ అధికార మార్పిడి బృందం పేర్కొంది. తమ నేతృత్వంలో పనిచేసే సభ్యుల వివరాలను బైడెన్- హారిస్​లు ఇటీవలే ప్రకటించారు.

Biden's White House appointees
బైడెన్​ 'శ్వేతసౌధ' బృందంలో మహిళలే అధికం
author img

By

Published : Dec 31, 2020, 12:04 PM IST

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ టీంలో.. 61 శాతం మహిళలే చోటు దక్కించుకున్నారని అధికార మార్పిడి​ బృందం(ట్రాన్సిషన్​ టీం) పేర్కొంది. మొత్తం 54 శాతం నల్ల జాతీయులు ఉన్నారని వెల్లడించింది. డెమొక్రాట్​​ నేత బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్..​ బుధవారం తమ నేతృత్వంలో పనిచేసే 100 మంది సభ్య బృందం వివరాలను వెల్లడించారు.

ఈ బృందం అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపే దిశగా అడుగులేస్తుందని ట్రాన్సిషన్​ బృందం తెలిపింది.

"శ్వేతసౌధానికి ఎంపికైన మొదటి 100 మందికి పైగా సభ్యుల్లో.. 61 శాతం మంది మహిళలు, 54 శాతం మంది నల్లజాతీయులు, 11 శాతం ఎల్​జీబీటీలు, మరికొందరు ఆసియా అమెరికన్లు ఉన్నారు. వీరంతా అమెరికా భిన్నత్వాన్ని సూచిస్తారు".

- బైడెన్​ ట్రాన్సిషన్​ బృందం.

ఇదీ చదవండి:

బైడెన్​ జట్టులో మరో ఇద్దరు భారతీయులకు చోటు

బైడెన్​ 'శ్వేతసౌధం డిజిటల్​ బృందం'లో కశ్మీరీ

ట్రాన్సిషన్​ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. శ్వేతసౌధానికి ఎంపికైన 20 శాతం సభ్యులు ఫస్ట్​ జనరేషన్​ అమెరికన్లు. 40 శాతం మంది సీనియర్​ సభ్యులకు పిల్లలు ఉన్నారు.

"అమెరికాకు ప్రతీకగా నిలిచే శ్వేతసౌధం బృందాన్ని ఎంపిక చేయాలని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నేను మొదటినుంచే అనుకున్నాం. భిన్నమైన సభ్యులుంటేనే అమెరికా ఎదుర్కొంటోన్న సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఎంపికైన సభ్యులు దేశాభివృద్ధికి కృషి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించొచ్చు".

--జో బైడెన్​.

తమ బృందంతో ముందుగా.. అమెరికాలో వైరస్​ ఉద్ధృతిని అదుపు చేసేందుకు ప్రణాళిక రచిస్తామని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆ దేశాలపై ఆంక్షలు కొనసాగించనున్న అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.