ETV Bharat / international

అఫ్గాన్​ సంక్షోభం: వేల మరణాలు- ట్రిలియన్​ డాలర్ల ఖర్చు! - అఫ్గాన్​ సంక్షోభం

అఫ్గానిస్థాన్​లో అమెరికా శకం ముగిసింది(us afghan war). గడిచిన 20ఏళ్లలో అఫ్గాన్​ ఎంతో అభివృద్ధి చెందినా.. అక్కడి పరిస్థితులు అమెరికాకు మాత్రం ఒక రకంగా చేటుచేసింది. వేలాది మంది అమెరికా సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోగా.. అఫ్గాన్​లో(afghanistan news) కార్యకలాపాల కోసం ట్రిలియన్​ డాలర్లు ఖర్చు చేసింది అగ్రరాజ్యం. రానున్న తరాలపై ఈ భారం పడనుంది.

afghan news
అఫ్గాన్​ వార్తలు
author img

By

Published : Aug 31, 2021, 4:59 PM IST

Updated : Aug 31, 2021, 5:22 PM IST

అఫ్గాన్​లో అమెరికా పోరాటం ముగిసింది. అమెరికా దళాలతో కూడిన చివరి విమానం.. మంగళవారం కాబుల్​ విమానాశ్రయాన్ని వీడింది(us army in afghanistan). 9/11 దాడులకు ప్రతీకారం కోసం అఫ్గాన్​లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం(us afghan war).. నాటి తాలిబన్​ పాలనకు ముగింపు పలికి.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ అదే అమెరికా వీడే సమయానికి పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి! అఫ్గాన్​ తాలిబన్ల వశమైంది.

ప్రస్తుతం అమెరికాలోని ప్రతి నలుగురిలో ఒకరు 9/11 దాడుల అనంతరం జన్మించినవారు ఉన్నారు. వాస్తవానికి అమెరికా పౌరులు.. అఫ్గాన్​లో తమ దేశ కార్యకలాపాలను పట్టించుకున్నది రెండు సందర్భాల్లోనే. అవి కూడా.. ప్రారంభం, ముగింపులోనే. అమెరికా కాంగ్రెస్​ కూడా వియత్నాం యుద్ధానికి ఇచ్చినంత ప్రాధాన్యం అఫ్గాన్​ వ్యవహారాలకు ఇవ్వలేదు!

అమెరికా వెనుదిరిగినా.. అఫ్గాన్​ వ్యవహారం ఆ దేశాన్ని ఇంకొంత కాలం పట్టిపీడిస్తుంది. ఎందుకంటే.. అక్కడి ఖర్చుల కోసం అగ్రరాజ్యం భారీగా అప్పులు చేసింది. రానున్న తరాల అమెరికా పౌరులు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో అఫ్గాన్​ సంక్షోభాన్ని(afghanistan news) అంకెల రూపంలో ఓసారి చూద్దాం..

మరణాలు (ఏప్రిల్​ నాటికి)..

  • అమెరికా సైనికులు- 2,461
  • అమెరికా కాంట్రాక్టర్లు- 3,846
  • నాటో సభ్యులు సహా మిత్ర దేశాల సైనికులు- 1,144
  • అఫ్గాన్​ పౌరులు- 47,245
  • తాలిబన్లు, ఇతర ఫైటర్లు- 51,191
  • జర్నలిస్టులు- 72
  • సహాయకులు- 444

20ఏళ్లలో అఫ్గాన్​ సాధించిన వృద్ధి..

  • శిశు మరణాల రేటు 50శాతానికి పైగా తగ్గింది.
  • చదవగలిగే అఫ్గాన్​ బాలికల సంఖ్య 37శాతం పెరిగింది.
  • 2005లో విద్యుత్​ సౌకర్యం కలిగిన అఫ్గానీలు 22శాతంగా ఉండగా.. 2019లో అది 98శాతానికి చేరింది.

అమెరికా కాంగ్రెస్​ విశ్లేషణ...

  • 9/11 దాడులకు ప్రతీకారం కోసం కాంగ్రెస్​ ఆమోదించిన తేదీ- 2001 సెప్టెంబర్​ 18.
  • అఫ్గాన్​పై యుద్ధం ప్రకటిస్తూ అగ్రరాజ్య చట్టసభ్యులు చేపట్టిన ఓటింగ్​- 0
  • వియత్మాం యుద్ధం సమయంలో ఖర్చులపై యూఎస్​ సెనేట్​ రక్షణ కేటాయింపుల ఉపసంఘం ప్రస్తావించిన సందర్భాలు- 42
  • అదే ఉపసంఘం అఫ్గాన్​-ఇరాక్​ యుద్ధంపై ఖర్చులు ప్రస్తావించిన సందర్భాలు- 5
  • 2001 సెప్టెంబర్​ 11 నుంచి అఫ్గానిస్థాన్​, ఇరాక్ యుద్ధంపై​ సెనేట్​ ఆర్థిక కమిటీ ఖర్చులను ప్రస్తావించిన సందర్భాలు- 1

పన్నుల రూపంలో...

యుద్ధాన్ని కొనసాగించాలంటే నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తూ ఉండాలి. అందుకోసం అగ్రరాజ్య అధ్యక్షులు తమ ప్రజలపై తాత్కాలికంగా పన్నుల భారాన్ని మోపారు. ప్రజలు కట్టే పన్నుల్లో.. కొరియన్​ యుద్ధం కోసం నాటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్​ 92శాతం, వియత్నాం యుద్ధం కోసం అధ్యక్షుడు లిండన్​ జాన్సన్​ 77శాతం పెంచారు. అయితే మాజీ అధ్యక్షుడు జార్జ్​ బుష్​ మాత్రం.. అలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. ధనికులు చెల్లించే పన్నుల్లో 8శాతం కోత విధించడం విశేషం.

అప్పులు-

  • అఫ్గాన్​, ఇరాక్​లో సేవలందించిన 40 లక్షల​ మంది ఆరోగ్యం, ఇతర అంశాల్లో అమెరికా చేయనున్న ఖర్చు- 2 ట్రిలియన్​ డాలర్లు
  • 2020 నాటికి.. అఫ్గాన్​-ఇరాక్​ యుద్ధం కోసం అప్పుల రూపంలో అగ్రరాజ్యం సమకూర్చిన నిధులు- 2 ట్రిలియన్​ డాలర్లు.
  • 2050 నాటికి వడ్డీతో సహా అమెరికా కట్టాల్సిన సొమ్ము- 6.5 ట్రిలియన్​ డాలర్లు.

హార్వర్డ్​ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్నడీ స్కూల్​, బ్రౌన్​ యూనివర్సిటీ చేపట్టిన 'కాస్ట్స్​ ఆఫ్​ వార్​' ప్రాజెక్ట్​ల డేటా నుంచి ఈ వివరాలు సేకరించారు.

ఇదీ చూడండి:- 'అఫ్గాన్​పై బాంబులేద్దాం.. మన సామాను తెచ్చేసుకుందాం'

Last Updated : Aug 31, 2021, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.