కరోనా వ్యాక్సిన్ కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చినా.. ప్రపంచంలోని ప్రజలు సాధారణ జీవనం గడపడానికి మరింత సమయం పడుతుందన్నారు అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రజలు సాధారణ జీవితం గడపొచ్చని వివరించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో ప్యానెల్ చర్చ సందర్భంగా ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. 2021 రెండు లేదా మూడో త్రైమాసికానికి పెద్ద ఎత్తున టీకాలు వేస్తామన్నారు ఫౌచీ.
అలాగే అధ్యక్ష ఎన్నికలను ఉద్దేశించి కూడా ఫౌచీ మాట్లాడారు. అమెరికాలో మాస్క్ ధరించడం రాజకీయ నినాదంగా మారిందన్నారు. ఈ పద్ధతి మారాలని ఆకాంక్షించారు.