లాటిన్ అమెరికాలోనే అతిపెద్దదైన బ్రెజిల్ సావో పాలో రాష్ట్రంలోని 'విలా ఫార్మోసా' శ్మశానవాటిక.. కరోనా మృతదేహాల దిబ్బగా మారింది. ఈ శ్మశానవాటికలో మహమ్మారితో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మృతదేహాలు వస్తుండటం వల్ల స్థలం సరిపోని పరిస్థిని నెలకొంది. దీంతో సామూహిక ఖననం చేస్తున్నారు.
బ్రెజిల్లో ఇప్పటివరకు 4,38,812 మందికి వైరస్ సోకగా 26,764 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది.
ఇదీ చూడండి:'సరిహద్దు సమస్యపై అమెరికా జోక్యం అవసరం లేదు'