ETV Bharat / international

కమలా హారిస్​​ అధికారిక నివాసం మార్పు​-కారణమిదే?

అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ కమలా హారిస్​.. తన అధికారిక నివాస భవనం నుంచి తాత్కాలికంగా బ్లెయిర్​ హౌస్​కు మారారు. అధికారిక భవనంలో మరమ్మతులు జరుగుతున్నట్లు హారిస్​ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Kamala Harris moves to Blair House as her official residence undergoes repairs
కమలా హారిస్​ అధికారిక నివాసం మార్పు​- కారణమిదే?
author img

By

Published : Jan 25, 2021, 1:05 PM IST

Updated : Jan 25, 2021, 1:42 PM IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​.. తన నివాసాన్ని తాత్కాలికంగా చారిత్రక బ్లెయిర్​ హౌస్​కు మార్చారు. ఆమె అధికారిక నివాసమైన నావల్​ అబ్జర్వేటరీలో మరమ్మతులు జరుగుతున్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల అధికార ప్రతినిధి సిమోన్​ శాండర్స్​ తెలిపారు.

అగ్రరాజ్య అధ్యక్షుని అధికారిక అతిథి గృహమైన బ్లెయిర్​ హౌస్.. పెన్సిల్వేనియాలో శ్వేతసౌధానికి వెళ్లే మార్గంలో ఉంటుంది. ఉపాధ్యక్షురాలి అధికారిక నివాస భవనమైన నావల్​ అబ్జర్వేటరీ కాంప్లెక్స్​.. వైట్​ హౌస్​కు వాయువ్యంలో సుమారు 4 మైళ్ల దూరంలో ఉంటుంది.

1893లో నిర్మించిన 33 గదుల భవనం(నావస్​ అబ్జర్వేటరీ)లో చిమ్నీలు, ఇతర పనుల కోసం సిబ్బంది కొత్త లైనర్స్​పై పని చేస్తున్నారని వాషింగ్టన్​ పోస్ట్ ఆదివారం తెలిపింది. 1824లో ఓ ప్రైవేట్​ గృహంగా నిర్మించిన బ్లెయిర్​ హౌస్​.. 1942 నుంచి యూఎస్​ ప్రెసిడెంట్​ అతిథి గృహంగా మారింది. విదేశీ ప్రముఖులు సందర్శించే 120 గదులు కలిగిన ఈ అందమైన, చరిత్రక భవనంలో గతంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర భారత నాయకులు బస చేశారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అధ్యక్షుడు జో బైడెన్​, అమెరికా ప్రథమ మహిళ ఇక్కడే ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: బైడెన్​ బృందంలో మరో నలుగురు భారతీయులు

Last Updated : Jan 25, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.