ETV Bharat / international

కాబుల్​ దాడి సూత్రధారి కోసం అమెరికా వేట.. రూ.75 కోట్లు రివార్డ్​ ప్రకటన - కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి

అఫ్గానిస్థాన్​లోని కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గతేడాది బాంబు పేలుళ్లకు కారణమైన ఐసిస్-కె నాయకుడు షనాల్లా గఫారీ ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది అమెరికా. 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఇస్తామని తెలిపింది.

sanaullah ghafari
షనాల్లా గఫారీ
author img

By

Published : Feb 9, 2022, 12:18 PM IST

ఐఎస్ఎస్​-కె అగ్రనేత షనాల్లా గఫారీపై భారీ నజరానా ప్రకటించింది అమెరికా. గతేడాది కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి అయిన గఫారీ ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఇస్తామని ఆ దేశ రివార్డ్​ ఫర్​ జస్టిస్ విభాగం తెలిపింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలపవచ్చని రివార్డ్ ఫర్ జస్టిస్​ సోమవారం ట్వీట్​ చేసింది.

అఫ్గాన్​లో 20 ఏళ్ల పోరాటానికి ముగింపు పలికి.. బలగాలను పూర్తిగా స్వదేశానికి తరలించింది అమెరికా. ఈ క్రమంలో.. 2021 ఆగష్టు 26వ తేదీన కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిపిన కారణంగా 185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 150 మంది పౌరులు గాయపడ్డారు. అందులో 18 మంది అమెరికా సిబ్బంది ఉన్నారు.

గఫారీ అఫ్గాన్​లో 1994లో జన్మించాడు. ప్రస్తుతం ఐఎస్​ఐఎస్​-కె ఉగ్రవాద సంస్థకి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ సంస్థ అఫ్గానిస్థాన్​లో జరుపుతున్న ఉగ్ర కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఆర్​ఎఫ్​జె తెలిపింది.

ఇదీ చూడండి:అఫ్గాన్​ హిమపాతానికి 12 మంది బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.