ETV Bharat / international

బైడెన్​ను అధికారికంగా నామినేట్ చేసిన​ డెమొక్రటిక్​ పార్టీ - us latest news

జో బైడెన్​ను అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా నామినేట్​ చేసింది డెమొక్రటిక్​ పార్టీ. దీంతో ఆయన నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను ఢీకొట్టనున్నారు. డెమెుక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్​ను ఎంపిక చేసుకున్నారు బైడెన్​.

Joe Biden officially becomes Democratic presidential nominee
బైడెన్​ను అధికారికంగా నామినేట్ చేసిన​ డెమోక్రటిక్​ పార్టీ
author img

By

Published : Aug 19, 2020, 9:53 AM IST

నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జో బైడెన్​ను అధికారికంగా నామినేట్​ చేసింది డెమొక్రటిక్ పార్టీ. పార్టీ జాతీయ సదస్సులో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అనంతరం సదస్సులో తొలిసారి లైవ్ స్క్రీన్​పై కనిపించారు బైడెన్​, ఆయన సతీమణి జిల్​. పార్టీ ప్రకటన అనంతరం బైడెన్​ మనవరాళ్లు, మనవళ్లు సంబురాల్లో మునిగిపోయారు.

అంతకుముందు డెమెుక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్​ను అంగీకరించడం తన జీవితంలో అత్యున్నత గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్​ చేశారు బైడెన్​.

అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ను ఢీకొట్టేందుకు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు బైడెన్. సర్వేలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. భారత​ సంతతికి చెందిన కమలా హారిస్​ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం కూడా ఆయనకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: విమానాల సంఖ్య రెట్టింపునకు అమెరికా-చైనా అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.