అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని గత కొంతకాలంగా ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ట్రంప్ కుమార్తె, ఆయన హయాంలో సీనియర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించిన ఇవాంక ట్రంప్‌పై ఇలాంటి వార్తలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది.. ఫ్లోరిడా సెనేట్‌కు జరిగే ఎన్నికల్లో ఆమె బరిలో దిగుతారని చర్చలు జరిగాయి. తాజాగా.. వీటికి ఇవాంక చెక్ పెట్టారు. ఫ్లొరిడా సెనేట్‌కు తాను పోటీ చేయడం లేదని.. ప్రస్తుతం అక్కడ సెనేటర్‌గా ఉన్న మార్కో రుబియోకే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం రుబియో ప్రతినిధి వెల్లడించారు.
రాజకీయ అజ్ఞాతాన్ని వీడి.. అమెరికా ప్రముఖ రేడియా వ్యాఖ్యాత రష్ లింబా మరణాంతరం.. గురువారం వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు ట్రంప్. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేనన్నారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం.. ఇవాంకకు సంబంధించిన వార్త బయటకు రావడం గమనార్హం.
శ్వేతసౌధంలో గడిపిన అనంతరం.. జీవితంలో స్థిరపడేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు.. రుబియోకు ఇవాంక స్పష్టం చేశారు.
అయితే ట్రంప్ కుటుంబంలో పలువురికి రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో చీఫ్ క్యాంపైన్ సరోగెట్‌గా పనిచేసిన ఆయన కోడలు లారా ట్రంప్.. నార్త్ కరోలినా సెనేట్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ పెద్ద కుమారుడు.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందారు.
ఇదీ చదవండి: 'ట్రంప్' యాప్.. గూగుల్ నుంచి ఔట్