ETV Bharat / international

బాగ్దాదీ మృతితో ఐసిస్​ కథ ముగిసిందా..? - al baghdadi dead news

ప్రపంచంలో అత్యంత క్రూర ఉగ్రసంస్థ 'ఇస్లామిక్​ స్టేట్​ ఆఫ్​ ఇరాక్ అండ్​ సిరియా(ఐసిస్​)'ని తుడిచిపెట్టే ప్రక్రియలో దాని అధినేత, అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని అంతమొందించింది అమెరికా. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ను హతమార్చి.. ప్రపంచాన్ని శాసించాలని చూసిన ఐసిస్​ను నాయకుడు లేని సైన్యంగా నిలిపింది. మరి అధినేత హత్యకు బదులుగా అమెరికాపై ఐసిస్​ ప్రతీకారం తీర్చుకోనుందా? ఒకవేళ ప్రతీకారం దిశగా అడుగులేసినా.. నడిపించే నాయకుడు ఉన్నాడా? బాగ్దాదీ మరణంతో ఐసిస్​ పనైపోయినట్లేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి వీటన్నింటికీ.. అమెరికా చెబుతున్న సమాధానమేంటో చూద్దాం.

బాగ్దాదీ మృతితో ఐసిస్​ కథ ముగిసిందా..?
author img

By

Published : Oct 28, 2019, 5:59 PM IST

"బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు. ఓ సొరంగంలోకి వెళ్లి తనంతట తాను పేల్చుకుని మరణించాడు. అయితే ఐసిస్​ను పునరుద్ధరించేందుకు ఆ సంస్థ నాయకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు"
-ఆదివారం బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరిస్తూ ట్రంప్​ చేసిన ప్రకటన ఇది.

" కొన్ని దేశాల సహకారంతో గతంలో ఐసిస్ రాజ్యాన్ని కూలదోశాం. ప్రస్తుతం దాని అధినేతను కూడా తుదముట్టించాం. అయితే ఇక్కడితో ఐసిస్‌ కథ ముగిసినట్లు కాదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ ఉగ్రసంస్థ మూలాలను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉంది."

-బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు ధ్రువీకరించిన అనంతరం ఆ దేశ రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్ చేసిన వ్యాఖ్యలివి.

"ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఐసిస్‌ మూలాలు ఎప్పటికైనా అగ్రరాజ్యానికి ముప్పే.. ఇంతటితో పోరాటాన్ని నిలిపేయొద్దు"

-ట్రంప్​ ప్రకటనపై ఓ ప్రముఖ సెనేటర్‌ స్పందన ఇది.

వీరి మాటలు వింటుంటే.. అబు బకర్ అల్​ బాగ్దాదీని అంతమొందించినప్పటికీ ఐసిస్ పని అయిపోలేదని స్పష్టమవుతోంది. బాగ్దాదీ మరణించినప్పటికీ.. తిరిగి వేగంగా పుంజుకుని ఇరాక్, అఫ్గానిస్థాన్​తో పాటు ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా అవతరించగలదని అర్థమవుతోంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాని మూలాలతో నాయకుడు లేనప్పటికీ ఈ భూగోళంపై ఎక్కడైనా మారణహోమం సృష్టించగలదని అవగతమవుతోంది.

అమెరికా నిఘా నీడలు కొనసాగుతాయి

'ఉగ్రవాదులను అంతంచేసి ముగింపులేని యుద్ధాలను సుఖాంతం చేస్తాం.'.. 2016లో ఎన్నికల ర్యాలీలో ట్రంప్​ పేర్కొన్న మాటలివి. అందుకనుగుణంగానే ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాదులు, దాని తదుపరి నాయకుడిపై అమెరికా నిఘా నీడలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెల ఆరంభంలో సిరియా నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్​ తెలిపారు. అయితే తూర్పు సిరియా గడ్డ తిరిగి ఐసిస్​ ఉగ్రవాదుల చేతుల్లోకి పోకుండా ఉండేందుకు కొంతమంది అమెరికా సైనిక బలగాల్ని అక్కడే ఉంచారు. దక్షిణ సిరియాలోనూ 150 మంది సైనికులతో రక్షణ ఇచ్చేందుకు ట్రంప్ అంగీకరించారు. రష్యాతో పాటు ఇతర దేశాలు కూడా ఐసిస్​పై పోరును కొనసాగించాలని పిలుపునిచ్చారు​.

బాగ్దాదీ మరణించినా.. ఇప్పటికీ అదే ప్రాంతంలో దాదాపు 10వేల మంది ఐసిస్​ ఉగ్రవాదులున్నారు. సిరియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్​ స్టేట్​ తన బలాన్ని పెంచుకుంటోందని ఇరాక్​, అఫ్గానిస్థాన్​ రక్షణ అధికారులు తెలిపారు. పాకిస్థాన్​, తజికిస్థాన్​, ఇరాన్​, భారత్​, బంగ్లాదేశ్​, ఇండోనేసియా తదితర దేశాల్లో విస్తరిస్తోందని తాజాగా స్పష్టం చేశారు.

అఫ్గానిస్థాన్​లో ఇప్పటికే ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోన్న ఐసిస్​.. స్వీడన్​లో మారణహోమం సృష్టించింది.

మారణహోమం తప్పదా..!

అమెరికాలోని చాలామంది తీవ్రవాదులకు బాగ్దాదీ స్ఫూర్తిగా నిలిచాడు. యూఎస్​ వ్యాప్తంగా గత ఐదేళ్లలో చాలా మంది జిహాదీలు మారణహోమాన్ని సృష్టించారు. 2016లో ఓర్లాండోలోని ఫ్లోరిడా నైట్​క్లబ్​లో 49 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపిన ఒమర్​ మాటీన్.. ఐసిస్​ ఉగ్రవాదిని అని తానే స్వయంగా ప్రకటించుకున్నాడు. కొద్ది నెలల ముందు శాన్​ బెర్నాడినో, కాలిఫోర్నియాలో భర్త సహా దాదాపు 14 మందిని చంపిన తష్ఫీన్​ మాలిక్​ అనే మహిళ.. బాగ్దాదీ హత్యకు ప్రతీకారంగా తాను మారణహోమం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫేస్​బుక్​ వేదికగా ప్రకటించింది.

అమెరికా జాగ్రత్తగా ఉండాలి

ఇప్పటికే సిరియా, ఇరాక్​పై పట్టు కోల్పోయిన ఐసిస్​కు బాగ్దాదీ మృతి తీరని నష్టం. భవిష్యత్​లో సారథ్యం వహించేందుకు బాగ్దాదీకి సరితూగే నాయకుడు కూడా లేడు. అలాగని ఐసిస్​ను తక్కువ అంచనా వేయలేం. నాయకుడు లేకపోయినా ఆ సంస్థ భావజాలమే పెను ముప్పుగా మారే ప్రమాదముంది. ఈ సవాలును ఎదుర్కోవడం అగ్రరాజ్యం ముందున్న ప్రధాన కర్తవ్యం.

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 28 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1057: US CA Fires Newsom PART: Must credit KXTV LOCAL10, No access Sacramento, No use US broadcast networks, No re-sale, re-use or archive, PART: Must credit KGO, No access San Francisco, No use US broadcast networks, No re-sale, re-use or archive 4237014
State of Emergency in California due to fires
AP-APTN-1049: Thailand US Trade AP Clients Only 4237013
Official comment on Thai seafood suspension by US
AP-APTN-1038: Iraq Women Protest AP Clients Only 4237011
Women demand reforms as Iraq protests continue
AP-APTN-1028: US DC Trump World Series 2 AP Clients Only 4237010
Trump smiles during World Series boos
AP-APTN-1023: Lebanon Roads Blocked AP Clients Only 4237009
Roads blocked in Beirut as anti-govt protests continue
AP-APTN-1011: US TX Vigil Shooting Must credit WFAA, No access Dallas, No use US broadcast networks, No re-sale, re-use or archive 4237006
Shots fired at vigil for Texas shooting victim
AP-APTN-1007: China MOFA Briefing AP Clients Only 4236999
DAILY MOFA BRIEFING
AP-APTN-1002: UK Johnson AP Clients Only 4237002
UK PM supports poppy appeal as EU grants extension
AP-APTN-1000: Thailand Australian Hells Angels AP Clients Only 4237003
Australian Hells Angels member arrested in Thailand
AP-APTN-0955: Belgium Brexit AP Clients Only 4237001
Tusk tweets UK Brexit 'flextension' until Jan 31, 2020
AP-APTN-0940: Archive Russia Bukovsky AP Clients Only 4237000
Famed Soviet dissident Bukovsky dies at 76
AP-APTN-0924: UK Truck Deaths Court No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4236998
Suspect in truck deaths case to appear in court
AP-APTN-0913: Vietnam UK Missing AP Clients Only 4236997
Vietnam families hope for news after UK truck deaths
AP-APTN-0904: Cambodia UK Missing Backpacker Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg/ Part must be used within 14 days from transmission; no archiving; no licensing; mandatory credit 4236993
Family fears for UK backpacker mssing in Cambodia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.