ఐసిస్ ఉగ్రవాద సంస్థ 2021లో మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దాడులకు పాల్పడొచ్చని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద వ్యతిరేక చీఫ్ వ్లాదిమిర్ వోరోన్కోవ్ హెచ్చరించారు. దాడుల్ని తిప్పికొట్టడానికి ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
కరోనా వైరస్ను జీవాయుధంగా ఐసిస్ వాడుకోలేదని వ్లాదిమిర్ అన్నారు. కానీ ఆ సంస్థ మళ్లీ పుంజుకొని దాడులు జరిపే అవకాశముందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: మరో క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాక్