ప్రపంచవ్యాప్తంగా మంగళవారం అనేక ప్రముఖ వెబ్సైట్లకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సహా రెడిట్, సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ వంటి దిగ్గజ వార్తా సంస్థల వెబ్సైట్స్ డౌన్ అయ్యాయి. పలు ప్రభుత్వ వైబ్సైట్స్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి. క్లౌడ్ స్టోరేజ్ సేవలు అందించే 'ఫాస్ట్ లీ' సర్వర్లో తలెత్తిన లోపం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది.
ఈ అంతరాయంపై స్పందించిన ఫాస్ట్ లీ.. ఈ సమస్యను మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు గుర్తించామని, ప్రస్తుతం దీనిని పరిష్కరించానమని స్పష్టం చేసింది. వెబ్సైట్లు అన్నీ అందుబాటులోకి వస్తుండటం వల్ల వినియోగదారులు ఆరిజిన్ లోడ్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని ఫాస్ట్ లీ పేర్కొంది.
ఇదీ చదవండి : Wuhan Lab: అమెరికాకు ఏడాది క్రితమే తెలుసా?