ETV Bharat / international

'సెల్ఫీకి మెరుగులు దిద్దటంలో మగువలే ముందు' - Indians emerging as prolific users of filters in selfies

భారత్​, అమెరికా దేశాల యువత సెల్ఫీలో అందంగా కనిపించేందుకు ఫిల్టర్​ యాప్​లను అధికంగా వాడుతున్నట్లు గూగుల్​ సంస్థ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. సెల్ఫీలను తీసుకోవటం,షేర్​ చేయటంలో భారత మహిళలు ముందున్నట్లు తెలిపింది. సెల్ఫీలు స్త్రీల ప్రవర్తన, ఆర్థికస్థితిపై ప్రభావం చూపుతున్నాయని తేలింది.

Indians emerging as prolific users of filters in selfies: study
'సెల్ఫీకి మెరుగులు దిద్దటంలో మగువలే ముందు'
author img

By

Published : Nov 21, 2020, 9:19 PM IST

సెల్ఫీచిత్రాల్లో అందంగా కనిపించేందుకు భారత్​, అమెరికా యువత ఫిల్టర్ యాప్​లను అధికంగా వాడుతున్నారని గూగుల్​ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 70శాతానికిపైగా భారతీయులు ఫ్రంట్​ కెమెరాలోనే ఫోటోలు తీసుకుంటున్నారని తెలిపింది. సెల్ఫీదిగటం, వాటిని పంచుకోవటంలో భారత మహిళలు ముందున్నారని పేర్కొంది. సెల్ఫీలు స్త్రీల ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడైంది. వారి ఆర్థిక పరిస్థితిపైనా సెల్ఫీచిత్రాల ప్రభావం పడుతుందని నివేదిక వివరించింది.

మగువలు ముందు వరుసలో..

భారత స్త్రీలు తమ చిత్రాలకు మెరుగులు దిద్దటంలో ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని తేలింది. సెల్ఫీలు తీసుకోవటం, ఇతరులతో పంచుకోవటం మగువల జీవితంలో భాగమైపోయిందని గూగుల్​ తన అధ్యయనంలో వివరించింది.

అయితే మగవారు సైతం సెల్ఫీలను బాగానే తీసుకుంటారు, కానీ వారు అందం కంటే ఎక్కువగా ఏ సందర్భంలో ఫొటో దిగారో వివరించటంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారని సర్వేలో వెల్లడైంది.

తల్లిదండ్రుల్లో అసంతృప్తి

కానీ తల్లిదండ్రులు మాత్రం సెల్ఫీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెల్ఫీలు పిల్లలకు ఏమాత్రం ఉగయోగం కాదని స్పష్టం చేశారు. పిల్లలు సెల్​ఫోన్​లను అధికంగా వాడుతున్నారని, దీంతో వారి భవితవ్యం ఆందోళనకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ ప్రత్యేకం ..

దక్షిణకొరియాలో మాత్రం ఫొటోలకు మెరుగులు దిద్దేందుకు పలురకాలు ఫిల్టర్​ యాప్స్​ను వాడటం మామూలే. ఆదేశంలో దీనికి ఎవరూ అడ్డు చెప్పరు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.