ETV Bharat / international

అగ్రరాజ్య ఆర్మీ తొలి సీఐఓగా భారతీయ అమెరికన్​ - first Chief Information Officer of the US Army

అమెరికా సైన్యంలో కీలక పదవికి నియమితులయ్యారు భారతీయ అమెరికన్​ డాక్టర్​ రాజ్​ అయ్యర్​. ఆ దేశ ఆర్మీ ప్రధాన సమాచార అధికారి(సీఐఓ)గా అయ్యర్​ను నియమిస్తున్నట్లు పెంటగాన్​ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది జులైలో ఏర్పాటు చేసిన ఈ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి అయ్యర్​ కావడం గమనార్హం.

Indian-American becomes US Army's first CIO
అమెరికా ఆర్మీ తొలి సీఐఓగా భారతీయ అమెరికన్​
author img

By

Published : Jan 7, 2021, 1:53 PM IST

అమెరికా ఆర్మీ ప్రధాన సమాచార అధికారి(సీఐఓ)గా భారతీయ అమెరికన్​ డాక్టర్​ రాజ్​ అయ్యర్​ నియమితులయ్యారు. 2020లో జులైలో పెంటగాన్​ ఈ పదవిని ఏర్పాటు చేసిన తర్వాత ఎంపికైన తొలి వ్యక్తి అయ్యర్​ కావడం విశేషం. అగ్రరాజ్య రక్షణ విభాగంలో అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టినవారిలో అయ్యర్ ఒకరు.

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో పీహెచ్​డీ చేసిన అయ్యర్​.. అమెరికా ఆర్మీ కార్యదర్శికి ప్రధాన సలహాదారుగా, ఇన్​ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్​ఫర్మేషన్​ మేనేజ్​మెంట్​(ఐటీ) సంబంధించిన విషయాల్లో కార్యదర్శికి అయ్యర్​ ప్రాతినిధ్యం వహిస్తారని పెంటగాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

జనరల్​ ర్యాంకు హోదా

అయ్యర్​ది సైన్యంలో మూడు స్టార్​ల జనరల్​ హోదాతో సమానమైన పదవి. అమెరికా సైన్యం ఐటీ ఆపరేషన్ల్​కు అవసరమైన 16 బిలియన్​ డాలర్ల వార్షిక బడ్జెట్​ను పర్యవేక్షకులుగా ఉంటారు అయ్యర్​. 100 దేశాల్లో 15,000 మంది పౌరులు, మిలటరీ అధికారులు అయ్యర్​ అధికార పరిధిలో పని చేస్తారు. రష్యా, చైనా వంటి దేశాల సైన్యాల కంటే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించేలా, శక్తిమంతమైన సైనిక బలగాలను తయారు చేయడానికి అవసరమైన విధానాలు, కార్యక్రమాల అమలుకు మార్గనిర్దేశం చేస్తారు అయ్యర్​.

తమిళనాడులోని తిరుచ్చుపల్లి ప్రాంతానికి చెందిన అయ్యర్​.. అమెరికాలోనే డెలాయిట్​ కన్సల్టింగ్ ఎల్ఎల్​పీలో భాగస్వామి. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్​గా కూడా వ్యవహరించారు.

ఇదీ చూడండి: జనవరి 20కి ముందే ట్రంప్​పై వేటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.