ETV Bharat / international

కరోనాపై ఐరాస తీర్మానానికి భారత్​ సహా 168 దేశాల మద్దతు - UN general assembly resolution

కరోనాపై పోరులో అంతర్జాతీయ సహకారం కోసం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రవేశపెట్టిన తీర్మానానికి 193 సభ్య దేశాల్లో భారత్​ సహా 168 దేశాలు అనుకాలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్​ వ్యతిరేకించగా.. ఉక్రెయిన్​, హంగేరీ సహా పలు దేశాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి.

India votes in favour of UNGA resolution
కరోనాపై ఐరాస తీర్మానికి భారత్​ సహా 168 దేశాల మద్దతు
author img

By

Published : Sep 12, 2020, 12:05 PM IST

కొవిడ్‌పై పోరాటంలో అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నాయకత్వ పాత్రను గుర్తించటం కోసం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ సహా 168 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 193 దేశాలు సభ్యత్వం కల్గిన ఐరాస సాధారణ సభలో అమెరికా, ఇజ్రాయెల్‌ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. ఉక్రెయిన్‌, హంగేరీ సహా పలు దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.

ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ఉపప్రతినిధి నాగరాజు నాయుడు ట్వీట్​ చేశారు.

  • India votes in favor of the #COVID19 omnibus resolution in the General Assembly recognizing the pandemic as one of the greatest global challenges that calls for a global response based on unity, solidarity and multilateral cooperation. pic.twitter.com/Hya9Eyro3L

    — Amb/DPR to UN Nagaraj Naidu IFS (@NagNaidu08) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" కరోనా మహమ్మారిని ప్రపంచ అతిపెద్ద సవాల్​గా గుర్తించి.. అంతర్జాతీయ సహకారానికి పిలుపునిచ్చిన ఐరాస తీర్మానానికి భారత్​ అనుకూలంగా ఓటు వేసింది."

- కె.నాగరాజు నాయుడు, ఐరాసలో భారత శాశ్వత ఉప ప్రతినిధి​

ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా కరోనా వైరస్‌ను చరిత్రలోనే అతిపెద్ద సవాల్‌గా సాధారణ సభ.. అభివర్ణించింది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అంతర్జాతీయ సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చింది. మహమ్మారి వల్ల ఉద్భవిస్తున్న సామాజిక, ఆర్థిక ప్రభావాలపై అంకితభావం, దృఢత్వంతో కూడిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

చర్చలో పాల్గొన్న అమెరికా ప్రతినిధులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనాలపై విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తిపై చైనా వాస్తవాలను దాచిపెట్టిందని అమెరికా ఆరోపించింది.

ఇదీ చూడండి: డబ్ల్యూహెచ్​ఓ నిధుల సమీకరణకు 'ఐరాస' పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.