ETV Bharat / international

మోదీ-ట్రంప్​ బంధాన్ని బైడెన్​ ఎలా స్వీకరిస్తారు? - భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం

భారత ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య ఉన్న బలమైన మైత్రి ప్రపంచానికి తెలిసిందే. గతేడాది హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో.. 'అబ్ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌' నినాదం కూడా ఇచ్చారు మోదీ. ఈ నేపథ్యంలో.. బైడెన్‌ విజయం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? బైడెన్‌-మోదీ బంధంపై నిపుణులు ఏం అనుకుంటున్నారు?

Indo-US ties under Biden
మోదీ-ట్రంప్‌ దోస్తీ.. బైడెన్‌ రాకతో అమెరికా-భారత్‌ బంధంపై ప్రభావం ?
author img

By

Published : Nov 17, 2020, 12:14 PM IST

గతేడాది అమెరికాలో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో.. ప్రధాని మోదీ.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌కు మద్దతుగా ఇచ్చిన 'అబ్ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌' నినాదంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. భారత్​ ప్రతిపక్ష కాంగ్రెస్‌.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

సంవత్సరం తర్వాత జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్‌ ఘనవిజయం సాధించటం వల్ల మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

హౌడీ-మోదీ కార్యక్రమంలో.. ట్రంప్​కు అనుకూలంగా మోదీ చేసిన వ్యాఖ్యలను అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్​ ఎలా స్వీకరించనున్నారు? మోదీ-ట్రంప్​ బలమైన మైత్రిబంధం వల్ల భారత్​పై బైడెన్​ వైఖరి ఎలా ఉండబోతోందనే దానిపై చర్చ జరుగుతోంది.

అయితే భాజపా నేతలు మాత్రం.. మోదీ-ట్రంప్‌ల బంధం.. బైడెన్‌ హయాంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపించదని చెబుతున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

అనేక దేశాల పరిస్థితి ఇదే..

అంతర్జాతీయంగా ప్రధాని మోదీ మాత్రమే కాదు.. చాలామంది దేశాధినేతలు శ్వేతసౌధంలో అధికార మార్పిడికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ, బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారో సహా కొన్ని ఐరోపా దేశాల నాయకులు పరిస్థితికి అనుగుణంగా తమ విదేశాంగ విధానంలో మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

అయితే.. భారత్‌-అమెరికా బంధంలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఎవరు అధికారంలోకి వచ్చినా రెండు దేశాలకు పరస్పర ప్రయోజనాలున్నాయని గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలను మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. రిపబ్లికన్లు అయినా.. డెమొక్రాట్లైనా.. భారత్‌లో ఏ ప్రభుత్వమున్నా వారి బలమైన బంధం కొనసాగించేందుకే మొగ్గు చూపుతారు.

-మీరా శంకర్‌, అమెరికాలో భారత మాజీ రాయబారి.

బలపడే అవకాశాలు ?

అదే సమయంలో పాలనా విధానాలు, పాలసీలు సైతం భవిష్యత్తులో అమెరికా-భారత్‌ సంబంధాలను నిర్ణయించనున్నాయనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

అంతకుముందు కాస్త ఇబ్బందుల్లో ఉన్న బంధాన్ని.. ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించి మరీ పునరుద్ధరించారు. ట్రంప్‌తో సత్సంబంధాలు నెరపటం వల్ల.. చైనాతో సరిహద్దు వివాదాలు సహా అన్ని అంశాల్లో భారత్‌కు అమెరికా అండగా నిలిచింది.

-రాజీవ్‌ భాటియా, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

ఇరు దేశాల ప్రధాన ప్రత్యర్థిగా చైనానే ఉన్న నేపథ్యంలో.. ఆసక్తులు, అభిప్రాయాలు కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో బంధం మరింత బలపడే అవకాశాలే కనిపిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు నిపుణులు.

ట్రంప్‌ నమ్మకం కోసం ప్రయాసలు..

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన మొదట్లో.. ఆయన నమ్మకం చూరగొనటం మోదీ ప్రభుత్వానికి కష్టంగానే ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు విశ్లేషకులు. నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో.. మోదీకి బలమైన బంధం ఉండేదన్న అనుమానం ట్రంప్‌ బృందం వ్యక్తం చేసిందని గుర్తు చేస్తున్నారు.

2015లో గణతంత్ర వేడుకలకు నాటి అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు.

ట్రంప్‌ దృష్టిలో మోదీ.. ఒబామాకు దగ్గరి మనిషి. ఈ నేపథ్యంలో మొదట్లో భారత ప్రధానిని కలిసేందుకు ట్రంప్‌ అంత ఆసక్తి చూపేవారు కాదు.

అదే సమయంలో ధృడమైన బంధాన్ని నెరిపేందుకు దౌత్యవేత్తలు మరిన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి.

డెమొక్రాట్లతో కష్టమే..

ప్రధాని మోదీకి డెమొక్రాట్లతో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జమ్ము-కశ్మీర్‌లో మానవహక్కుల అంశంలో కమలా హారిస్ సహా చాలామంది డెమొక్రటిక్‌ నేతలు మోదీ ప్రభుత్వంపై సానుకూల ధోరణితో లేరు.

రెండేళ్ల క్రితం.. భారత మూలాలున్న అమెరికన్‌ ప్రతినిధుల సభ సభ్యురాలు డెమొక్రటిక్ నేత ప్రమీలా జయ్‌పాల్‌తో సమావేశానికి విదేశాంగ మంత్రి జయశంకర్‌ విముఖత వ్యక్తం చేశారు. జమ్ము-కశ్మీర్‌లో నిర్భంధం అంశమే ఇందుకు కారణం. ఈ అంశంపై నాడు కమలా హారిస్‌ సహా పలువురు డెమొక్రాట్లు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

అయితే, అగ్రరాజ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ తరహా సమస్యలన్నీంటికీ పెద్ద ప్రాధాన్యత ఉండదంటున్నారు విశ్లేషకులు.

ఒబామాతో మోదీ ప్రభుత్వానికి బలమైన బంధం ఉండేదన్న విషయం.. బైడెన్‌ బృందం మనసులో మెదులుతూనే ఉంటుంది. రాజకీయాలు, దౌత్యసంబంధాల్లో చాలా పురోగతి వచ్చింది.

ప్రస్తుతం భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా ఉన్నాయని.. వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో మరింత పురోగతి సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వాల్లో మార్పులు ఈ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం లేదని అంటున్నారు.

వాషింగ్టన్ ‌వైపు నుంచి చూసినపుడు.. యూఎస్-చైనాల మధ్య పరిస్థితులు దిగజారాయి. పాక్‌స్థాన్‌ కుటిలబుద్ధి బయటపడింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో జపాన్‌, భారత్‌లు అమెరికాకు కీలకం. ఈ నేపథ్యంలో ఇరుదేశాల అభిప్రాయాలు కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

-విష్ణు ప్రకాశ్‌, దక్షిణ కొరియా మాజీ రాయబారి

వ్యక్తిగత అభిప్రాయాలు?

ట్రంప్‌తో సత్సంబంధాల కోసం మోదీ ప్రభుత్వం.. ఎన్నో ప్రయత్నాలు చేసింది. బైడెన్​ విషయంలోనూ మోదీ అలా చేసే అవకాశం ఉంది. అయితే బైడెన్‌ సర్కార్‌ కొన్ని అంశాల్లో ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

బైడెన్‌.. ట్రంప్‌లాగా అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోరు. ట్రంప్‌ది పూర్తిగా వ్యక్తిగతమైన పరిపాలన శైలి. బైడెన్‌ పాలనలో ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు జొప్పించరని అనుకుంటున్నాం. మోదీ విషయంలోనూ ఇదే జరగనుంది. సంస్థాగత పనితీరును చూస్తారని అభిప్రాయపడుతున్నాం. యూఎస్ ఆసక్తులకు అనుగుణంగా పాలన సాగనుంది.

విధానం ముందుకు వెళ్లే మార్గం ?

ట్రంప్‌ను మోదీ హ్యూస్టన్‌ ర్యాలీకి ఆహ్వానించినప్పుడే.. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వారించారు. ఇతర దేశాల రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు అవుతుందని ట్రంప్​కు చెప్పారు.

మొత్తంగా మోదీ-ట్రంప్‌ దోస్తీ వల్ల భవిష్యత్తులో బైడెన్‌ సారథ్యంతో ఎటువంటి ఇబ్బందులు రావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్‌తో అనుబంధం ఎలా ఉన్నా.. పరిస్థితులు మారిపోతాయని ఆశిస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అమెరికాలో ఫలితాలు వెలువడిన వెంటనే బైడెన్‌ విజయంపై మోదీ అభినందనలు తెలియజేశారు. కొన్ని రోజుల్లో ఇరువురు నేతలు మాట్లాడుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.