ETV Bharat / international

భారత్​ అంటే 'ఇడ్లీ లాంటి కమ్మని ప్రేమ': కమలా - US Democratic leader Kamala Harris

త్వరలోనే జరగనున్న అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్​ నాయకురాలు కమలా హారిస్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 74 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, రానున్న కాలంలో మరింత పురోగతి సాధిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

India-remarkable-progress-over-past-74-years-says-Kamala-Harris
74ఏళ్ల పురోగతి ప్రతిబింబిస్తోంది: కమలా హారిస్‌
author img

By

Published : Aug 16, 2020, 2:58 PM IST

అమెరికా అధ్యక్షుడి బరిలో ఉన్న జో బైడెన్‌తో కలిసి కమలా హారిస్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇండియన్‌-అమెరికన్‌ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమలా హారిస్‌ భారత్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో అసలైన హీరోల విజయగాథలను చిన్నతనంలో చెన్నైబీచ్‌లో నడుస్తూ.. తన తాతగారు చెప్పిన విషయాలను కమలా హారిస్‌ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తన తల్లి శ్యామలా చేసిన ఇడ్లీ లాంటి కమ్మని ప్రేమ గుర్తులను కమలా హారిస్‌ ఈ సందర్భంగా అక్కడివారితో పంచుకున్నారు.

భారత ప్రజలకు ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన దశాబ్దాల్లో భారత్‌ సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. 'న్యాయం కోసం చేసిన పోరాటంలో మన ప్రజలు చెప్పుకోదగిన పురోగతి సాధించారు. గత 74 సంవత్సరాల పురోగతి ప్రతిబింబిస్తోంది. మరింత మంచి భవిష్యత్తును నిర్మించడానికి మనమందరం కట్టుబడి ఉందాం. ఈ సమయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది.' అని కమలా హారిస్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకుంటే హెచ్‌-1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని అంతకుముందు జరిగిన ప్రచారకార్యక్రమంలో ఆయన ప్రచారబృందం ప్రకటించింది.

ఇదీ చదవండి: ఎల్లలు దాటిన 'స్వాతంత్ర్య' భారత సంబరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.