ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా భారత్ తమకు గొప్ప భాగస్వామ్య దేశం అని శ్వేతసౌధం తెలిపింది. ఆర్థికం, భద్రత, వ్యూహాత్మక అంశాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్నామని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ జెన్ సాకి తెలిపారు.
" ప్రాంతాల పరంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానూ భారత్ అమెరికాకు గొప్ప భాగస్వామ్య దేశం. పలు అంశాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్నాం."
-- జెన్ సాకి, శ్వేతసౌధం మీడియా సెక్రటరీ
భారత్లో కొవిడ్-19 రెండో దశ విజృంభణ సమయంలో అమెరికా సాయపడిందన్నారు. భవిష్యత్తులోనూ తమ నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
మే లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. 100 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ కలిగిన వైద్య పరికరాలు, సామగ్రి పంపించి సాయం చేశారని గుర్తుచేశారు.
ఇదీ చదవండి : 'హెచ్1బీ' కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!