ETV Bharat / international

'అఫ్గాన్ విషయంలో భారత్​ సహకారం అవసరం' - అఫ్గానిస్థాన్ ఆక్రమణ

అఫ్గాన్ విషయంలో భారత్ ఆందోళనతోనే ఉందని, తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు విఘాతం కలుగుతుందని భావిస్తోందని అమెరికా (India US) పెంటగాన్ అధికారి పేర్కొన్నారు. అఫ్గాన్​తో పాటు అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ (India US news) సహకారం అవసరమని స్పష్టం చేశారు.

US INDIA PENTAGON
అఫ్గాన్ విషయంలో భారత్​ సహకారం అవసరం'
author img

By

Published : Oct 28, 2021, 10:04 AM IST

అఫ్గానిస్థాన్​లో పరిస్థితులపై భారత్ ఆందోళనతో (India Afghanistan relations) ఉందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. అఫ్గాన్​లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులపై భారత్​కు (Afghan India news) అవగాహన ఉందని, ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు విఘాతం కలుగుతుందని ఆ దేశం భావిస్తోందని పెంటగాన్ ఉన్నతాధికారి కొలిన్ హెచ్ కాల్ వివరించారు. ఈ మేరకు అఫ్గాన్, దక్షిణ మధ్యాసియా భద్రతపై సెనేట్​ సాయుధ సేవల కమిటీలో జరిగిన విచారణకు హాజరైన ఆయన.. చట్టసభ్యులకు తాజా పరిస్థితుల గురించి సమాచారం అందించారు.

"ఈ సమస్యపై వారు(భారతీయులు) మనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. నిఘా వివరాలను పంచుకోవడం సహా, అవసరమైన చోట్ల మనం సహకారం అందించాలి. భారత్, అమెరికా (India US) కలిసి పనిచేస్తే ఇరుదేశాలకు ప్రయోజనకరం. అఫ్గానిస్థాన్, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విషయంలోనే కాకుండా హిందూ మహాసముద్రంలో విస్తృతమైన ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరుదేశాల (India US news) మధ్య సహకారం చాలా ముఖ్యం."

-కొలిన్ హెచ్ కాల్, డిఫెన్స్ పాలసీ అండర్ సెక్రెటరీ

అఫ్గాన్ విషయంలో భారత్ పాటించే విధానాలు ప్రధానంగా పాకిస్థాన్​ను దృష్టిలో పెట్టుకొనే ఉంటాయని కొలిన్ పేర్కొన్నారు. తాలిబన్ ప్రభుత్వం భారత వ్యతిరేక ఉగ్రవాదులకు మద్దతు పలుకుతుందని ఆందోళనలో ఉందని చెప్పారు. అమెరికాకు ఉన్న అతిపెద్ద రక్షణ భాగస్వాముల్లో ఒకటైన భారత్.. అఫ్గాన్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందనేది అగ్రరాజ్యానికి ముఖ్యమని వివరించారు.

పాకిస్థాన్​ సైతం ముఖ్యమే!

మరోవైపు, పాకిస్థాన్ అంశంపై సెనేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు కొలిన్. పాకిస్థాన్​తో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. అఫ్గాన్ అంశంలో మాత్రం ఉగ్రవాద వ్యతిరేక ధోరణితేనే ఉందని చెప్పారు. ఉగ్రవాదులకు అఫ్గాన్ స్వర్గధామం కాకూడదని కోరుకుంటోందని చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాకిస్థాన్ సహకారం ఆశాజనకంగానే ఉందని అన్నారు. ప్రాంతీయ ఉగ్రవ్యతిరేక వ్యూహాలను అమలు చేయడానికి పాకిస్థాన్ మద్దతు అవసరమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.