అమెరికా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్, కమలా హారిస్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కమలా హారిస్ అమితంగా ఇష్టపడే సీఫుడ్ 'గంబో' మెనూలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ క్యాటరింగ్ ఆర్డర్ శాన్ఫ్రాన్కిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్ రాబర్డ్ డోర్సేకు దక్కింది.
గంబో అంటే క్యాప్సికం, ఉల్లిపాయలు, మాంసం లేదా షెల్ఫిష్తో చిక్కగా తయారు చేసే సూప్. కమల ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఇది అధికారికంగా లూసియానా రాష్ట్ర వంటకం కూడా కావడం విశేషం.
పాత స్నేహితులు..
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్, తాను బెర్కిలీలోని థౌసండ్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నట్లు డోర్సే తెలిపారు. ఇద్దరికీ ఫస్ట్ గ్రేడ్ టీచర్ ఫ్రాన్సెస్ విల్సన్ అని చెప్పారు. ఈ విషయం తనకు ఐదేళ్ల క్రితమే తెలిసిందని వెల్లడించారు. విల్సన్ తన జీవితంలో ముఖ్య మార్గదర్శకురాలని పేర్కొన్నారు.
ఇద్దరికీ ఒకే టీచర్ బోధించడం ఒక విశేషమైతే.. తామిద్దరం గంబో వంటకాన్నే అమితంగా ఇష్టపడటం మరో విశేషమని డోర్సే చెప్పారు. అందుకే ఈ వంటకాన్ని ప్రమాణస్వీకారోత్సం రోజు అతిథులకు ఇచ్చే విందు మెనూలో ప్రత్యేకంగా చేర్చినట్లు తెలిపారు. కొత్త పాలనా యంత్రంగానికి పసందైన విందు సమకూర్చడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు డోర్సే ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకను ఘనంగా జరుపుకోవడం కోసం ఒక రోజు ముందు నుంచే భోజనప్రియులకు వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు.
ప్రమాణస్వీకారోత్సవం రోజు అతిథులకు ఇచ్చే విందు మెనూ ఐటమ్స్
అప్పెటైజర్..
పాంకో క్రస్టెసడ్ క్రాబ్ కేక్స్
ఆర్గానిక్ కోస్టల్ గ్రీన్స్ అండ్ కాజున్ రిమౌలేడ్
ఎంట్రీ..
బేయూ ష్రింప్ సాసేజ్ గంబో
లూసియానా లవ్, డీప్ యాంబర్ రౌక్స్, స్వీట్ పెప్పర్స్, బ్లాకెన్డ్ చికెన్, జలాపినో, ప్రెష్ క్రాబ్స్, హాట్ లింక్స్, ష్రిర్ ఓక్రా, ఫ్రాగ్రాంట్ వైట్ రైస్ టు స్టీమ్ ఎట్ హోం.
స్వీట్
బనానా రైసిన్ బ్రెడ్ పడ్డింగ్,
బౌర్బన్ కారామెల్
ఇదీ చదవండి: మన కమలకు రంగవల్లికలతో స్వాగతం