ETV Bharat / international

టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న బైడెన్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ ముందున్నట్టు పలు సర్వేలు సూచిస్తున్నాయి. అయితే టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ బైడెన్​ దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. బైడెన్​ చర్చా కార్యక్రమాన్ని 14.1మిలియన్ల మంది వీక్షించగా.. ట్రంప్​ ప్రసంగాన్ని 13.5మిలియన్ల మంది చూశారు.

In head-to-head town halls, Biden beats Trump in audience
టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న బైడెన్​
author img

By

Published : Oct 17, 2020, 11:30 AM IST

అధ్యక్ష ఎన్నికలకు అమెరికా సన్నద్ధమవుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​లు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిపిన పలు సర్వేల్లో ట్రంప్‌ కంటే బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్నట్లు సమాచారం. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ బైడెనే దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నీల్సన్‌ కంపెనీ వివరాల ప్రకారం.. గురువారం ఏబీసీలో ప్రసారమైన 90 నిమిషాల బైడెన్‌ చర్చా కార్యక్రమాన్ని 14.1 మిలియన్ల మంది వీక్షించారు. మరోవైపు ఎన్‌బీసీ, సీఎన్‌బీసీ, ఎంఎస్‌ఎన్‌బీసీ ఛానళ్లలో ప్రసారమైన ట్రంప్‌ 60 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని 13.5 మిలియన్ల మంది చూశారు.

సంవాదం వీటిపైనే...

ఈ నెల 22న జరగనున్న సంవాదానికి సంబంధించిన అంశాల జాబితాను కమిషన్​ ఆన్​ ప్రెసిడెన్షియల్​ డిబేట్స్​ విడుదల చేసింది. అభ్యర్థుల మధ్య ఈసారి జాతీయ భద్రత అంశంపై వాడీవేడీ సంభాషణ జరగనుంది. దీనితో పాటు కరోనాపై పోరు, అమెరికా కుటుంబాలు, వాతావరణ మార్పు, నాయకత్వం అంశాలున్నాయి.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.