ETV Bharat / international

తొలిసారి మాస్క్​తో దర్శనమిచ్చిన ట్రంప్​ - ట్రంప్​ మాస్కు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తొలిసారి మాస్క్​తో దర్శనమిచ్చారు. వాషింగ్టన్​లోని ఓ ఆసుపత్రికి వెళ్లిన ట్రంప్​ మాస్క్​ వేసుకున్నారు. అయితే తాను ఎప్పుడూ మాస్క్​కు వ్యతిరేకం కాదని.. కానీ దానికి సమయం, సందర్భం ఉంటుందన్నారు.

In a first, Trump dons mask as US' COVID death toll surpasses 1,34,000
తొలిసారి మాస్కుతో దర్శనమిచ్చిన ట్రంప్​
author img

By

Published : Jul 12, 2020, 8:23 AM IST

Updated : Jul 12, 2020, 10:23 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరోనా సంక్షోభంలో తొలిసారిగా మాస్క్​ ధరించి దర్శనమిచ్చారు ట్రంప్​. వాల్టర్​ రీడ్​ వైద్య కేంద్రంలో మిలిటరీ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన.. మాస్క్​ వేసుకున్నారు.

In a first, Trump dons mask as US' COVID death toll surpasses 1,34,000
తొలిసారి మాస్క్​తో దర్శనమిచ్చిన ట్రంప్​

"మాస్క్​ ధరించడాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు. అయితే దానికి సమయం, సందర్భం ఉంటుంది."

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అయితే మాస్క్​ ధరించాలన్న ట్రంప్​ నిర్ణయం వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి సలహాదారులు, సన్నిహితులు, శ్వేతసౌధం సహాయకులు.. ట్రంప్​ను మాస్క్​ వేసుకునేందుకు ఒప్పించడానికి అష్టకష్టాలు పడ్డారు. వారం రోజుల ముందు నుంచే ట్రంప్​ను ఈ విషయంపై అభ్యర్థిస్తూ వచ్చారు.

మాస్క్​ ధరించి తొలిసారి

టుల్సా, ఓక్లహామా సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో ట్రంప్​ మద్దతుదారులు మాస్క్​ ధరించకుండా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'మాస్క్​ వేసుకొని.. వారందరికీ ఆదర్శంగా నిలవాలని' ట్రంప్​ను కోరారు సన్నిహితులు.

ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కరోనా కేసులు, మరణాలు అగ్రరాజ్యంలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 33 లక్షలకుపైగా కేసులు, లక్షా 37 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

వాల్టర్​ రీడ్​లో ట్రంప్​

ఇదీ చూడండి:- 'మాస్క్​ పెట్టుకోవడానికి ఇబ్బందేమీ లేదు.. కానీ'

Last Updated : Jul 12, 2020, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.