ETV Bharat / international

అదే నిజమైతే టెస్లాను మూసేస్తా: మస్క్‌ - చైనా ప్రభుత్వం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్​ మస్క్​ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్లా కార్లను గూఢచర్యానికి ఉపయోగించినట్లు తేలితే.. తమ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తామని స్పష్టం చేశారు. చైనా మిలిటరీకి సంబంధించిన ప్రదేశాల్లో టెస్లా కార్లను నిషేధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మస్క్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

author img

By

Published : Mar 21, 2021, 5:23 AM IST

టెస్లా కార్లను గూఢచర్యానికి ఉపయోగించినట్లు తేలితే తమ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ అన్నారు. వినియోగదారులకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా చాలా గోప్యంగా ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. చైనాకు చెందిన ఓ వ్యాపార వేదిక నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో మాట్లాడుతూ శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా మిలిటరీకి సంబంధించిన ప్రదేశాల్లో టెస్లా కార్లను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: చంద్రుడిపైకి వెళ్లాలని ఉందా.. ఇదిగో ఛాన్స్!

చైనా వ్యాప్తంగా నిషేధించారా?

టెస్లా కార్లను చైనావ్యాప్తంగా నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, అది వాస్తవం కాదు. ఆ దేశానికి చెందిన మిలిటరీ స్థావరాలు, వాటి పరిసర ప్రాంతాల్లోకి మాత్రమే టెస్లా కార్లను అనుమతించేది లేదంటూ అక్కడి అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్లలో కెమెరా, రాడార్‌, జీపీఎస్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో రికార్డయ్యే సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్‌ చేయగలిగితే.. కారు ఏ ప్రదేశంలో తిరుగుతుందో కనిపెట్టడం చాలా తేలికవుతుందని అభిప్రాయపడ్డారు. మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని.. అందుకే టెస్లా కార్లను నిషేధిస్తున్నామని తెలిపారు.

అయితే, అమెరికా వెలుపల టెస్లాకు ఉన్న ఏకైక తయారీ కేంద్రం షాంఘైలోనే ఉంది. అలాగే కంపెనీకి చెందిన మోడల్‌-3 కార్లు చైనాలో భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. 2020లో సంస్థ కార్ల విక్రయాల్లో 30 శాతం చైనాలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కంపెనీ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రపంచ అపర కుబేరుడిగా మళ్లీ మస్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.