ETV Bharat / international

'హెచ్​సీక్యూను అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారు' - హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అమెరికా

హైడ్రాక్సిక్లోరోక్విన్​ వాడకాన్ని అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారని శ్వేతసౌధం అధికారి వెల్లడించారు. కానీ భారత్​లో ఈ మందును ఇప్పటికీ వినియోగిస్తున్నట్టు తెలిపారు. కరోనా చికిత్సకు హెచ్​సీక్యూ ప్రభావవంతంగా పనిచేస్తోందని.. మరణాలు రేటు 50శాతం తగ్గిందని పేర్కొన్నారు.

Hydroxychloroquine has become highly politicised in US but India uses it widely: WH official
'హెచ్​సీక్యూను అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారు'
author img

By

Published : Jul 8, 2020, 12:05 PM IST

కరోనా చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు శ్వేధసౌధం అధికారి ఒకరు తెలిపారు. హెచ్​సీక్యూ వాడకాన్ని అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారని, కానీ భారత్‌లో ఆ మందును ఇప్పటికీ విరివిగా వాడుతున్నట్లు ట్రేడ్​ అండ్​ మాన్యుఫాక్చరింగ్​ పాలసీ డైరక్టర్​ పీటర్​ నవర్రొ చెప్పారు.

మలేరియా చికిత్సకు వాడే హెచ్​సీక్యూ మందు.. కొవిడ్‌ ఆరంభ దశలో ఉన్నవారికి బాగా పనిచేస్తున్నట్లు తాజా పరిశోధనల్లో తేలినట్లు పీటర్​ నవర్రొ వెల్లడించారు. ఈ మందు వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని.. దాదాపు 50శాతం మరణాల రేటు తగ్గిందని ట్రేడ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ డైరెక్టర్‌ అన్నారు.

అమెరికాలోని డెట్రాయిట్‌ హాస్పిటల్‌ సిస్టమ్స్‌కు చెందిన నలుగురు డాక్టర్ల బృందం.. కొవిడ్‌ చికిత్సలో.. ముందస్తు రోగ నిరోధకత పెంచుకునేందుకు హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అత్యవసర వాడకం కోసం అభ్యర్థించగా ఏఫ్‌డీఏ పరిశీలిస్తోందని వివరించారు.

ఇదీ చూడండి- 'హైడ్రాక్సీ' ట్రయల్స్​ బంద్​: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.