వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు ఫేస్బుక్ సిద్ధమైంది. ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో కలిసి సమాచార దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే.
Sharing a note from Mark Zuckerberg: “A Privacy-Focused Vision for Social Networking” https://t.co/RPW4qCJcM2 pic.twitter.com/CdE84s4aq2
— Facebook (@facebook) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sharing a note from Mark Zuckerberg: “A Privacy-Focused Vision for Social Networking” https://t.co/RPW4qCJcM2 pic.twitter.com/CdE84s4aq2
— Facebook (@facebook) March 6, 2019Sharing a note from Mark Zuckerberg: “A Privacy-Focused Vision for Social Networking” https://t.co/RPW4qCJcM2 pic.twitter.com/CdE84s4aq2
— Facebook (@facebook) March 6, 2019
వ్యక్తిగత గోప్యత కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ తెలిపారు. నూతన భద్రతా విధానాలతో నెటిజన్ల సమాచారానికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.


- వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనల కోసం సంస్థలకు అందజేసినట్లు ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్నుంచి ఈ సామాజిక మాధ్యమంపై వినియోగదారుల్లో అపనమ్మకం పెరుగుతూ వచ్చింది. నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించామని జుకెర్‌బర్గ్ వెల్లడించాడు. సమాచారం, చిత్రాలకు సరికొత్త ఎన్క్రిప్షన్ టెక్నిక్‌తో భద్రత కల్పించనున్నారు. ఫలితంగా మూడో వ్యక్తితో సహా ఫేస్బుక్ సైతం యూజర్ డేటాను చూడలేదు. న్యూస్‌ఫీడ్, గ్రూప్ సర్వీసుల్లో మాత్రం మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మార్పులతోనైనా ఇన్‌స్టా, ఫేస్బుక్ వినియోగదారులను కాపాడుకోవచ్చని అనుకుంటోంది సంస్థ.నూతన ఎన్క్రిప్షన్ టెక్నిక్

మెసేంజర్, వాట్సాప్, ఇన్‌స్టా యాప్‌ల్లో నూతన ఎన్క్రిప్షన్ సాంకేతికతను వాడనున్నారు. ఇప్పటికే ఈ ఫీచర్ వాట్సాప్‌లో ఉంది. సమాచారాన్ని పంపినవారు, తీసుకున్నవారు మాత్రమే చూడగలరు.

ఫొటోల పబ్లిక్ షేరింగ్ మాత్రం అలానే ఉండనుంది. మెసేంజర్, వాట్సాప్, ఇన్‌స్టా యాప్‌ల్లో ఒకే ప్రొఫైల్ ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు వాట్సాప్‌లోకి సైతం యాడ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని ఎలా అడ్డుకుంటారనే దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు టెక్ నిపుణులు.


- 87 మిలియన్ యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందని.. ఈ సమాచారం ఆధారంగానే 2016లో ట్రంప్ ప్రచారం నిర్వహించినట్లు ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వచ్చాయి. రష్యాకి చెందిన కొందరు అమెరికా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని విమర్శలూ ఎదుర్కొన్నారు. దీనిపై రెండు రోజుల విచారణ ఎదుర్కొని.. క్షమాపణలు సైతం చెప్పాడు జుకెర్‌బర్గ్.విచారణ ఎదుర్కొన్న మార్క్ జుకెర్‌బర్గ్
