ETV Bharat / international

'డెల్టా' దెబ్బకు ఆసుపత్రులు ఫుల్- మళ్లీ ఆంక్షలు!​ - డెల్టా

ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్​ విజృంభిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో దేశంలోనే తొలిస్థానానికి చేరింది. దీంతో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. మరోవైపు.. ఆస్ట్రేలియాలో కేసుల పెరుగుదలతో బ్రిస్బేన్​ సహా పలు నగరాల్లో లాక్​డౌన్​ పొడిగించారు.

COVID-19 hospitalisations
డెల్టా వేరియంట్​తో పెరుగుతున్న కేసులు
author img

By

Published : Aug 2, 2021, 1:08 PM IST

అమెరికా​లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. డెల్టా వేరియెంట్​ విజృంభణతో కొత కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఫ్లోరిడాలో వైరస్​ ప్రారంభమైన నాటి నుంచి తొలిసారి ఆదివారం అత్యధిక కేసులు నమోదు కాగా.. ఆ మరుసటి రోజునే ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఏడాది క్రితం వ్యాక్సినేషన్​ ప్రారంభానికి ముందు.. 2020 జులైలో ఒక్కరోజులో అత్యధికంగా 10,170 మంది ఆసుపత్రుల్లో చేరగా.. తాజాగా 10,207 మంది చేరినట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది.

తాజా గణాంకాలతో రాష్ట్రాల వారీగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో తొలిస్థానానికి చేరుకుంది ఫ్లోరిడా. కొన్ని ఆసుపత్రుల్లో ఐసీయూల్లో పడకలు లేక హాల్స్​లోనే బెడ్లు ఏర్పాటు చేస్తుండటం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గత వారంలో ఫ్లోరిడాలో రోజుకు సగటున 1,525 మంది పెద్దవారు, 35 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరేవారు. ఈ విషయంలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఫ్లోరిడా.

" ఆసుపత్రుల్లో చేరుతున్నవారు, కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఫ్లోరిడా వ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు.. ప్రజలు కరోనా ముందరి స్థితికి చేరుకుంటున్న క్రమంలో ఇటీవలి పెరుగుదల ఆందోళనకరం. "

- జసొన్​ సెలమి, ప్రొఫెసర్​, యూనివర్సిటీ ఆఫ్​ సౌత్​ ఫ్లోరిడా

గత శనివారం ఫెడరల్​ హెల్త్​ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫ్లోరిడాలో 21,683 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అంతకు ముందు రోజు 17,093 కేసులు వచ్చాయి. ఈ క్రమంలో మాస్క్​ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఫ్లోరిడా గవర్నర్​ రాన్​ డెసాంటిస్​.

ఆస్ట్రేలియాలో లాక్​డౌన్​ పొడిగింపు..

కొవిడ్​-19 వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన బ్రిస్బేన్​లో లాక్​డౌన్​ను వచ్చే ఆదివారం(ఆగస్టు 8) వరకు పొడిగించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. క్వీన్స్​లాండ్​ రాష్ట్రంలోని బ్రిస్బేన్​తో పాటు సమీప మున్సిపాలిటీలో విధించిన లాక్​డోన్​ మంగళవారంతో ముగియాల్సి ఉంది. కొత్తగా 13 డెల్టా వేరియంట్​ కేసులు నమోదైన క్రమంలో లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

సిడ్నీతో పాటు న్యూ సౌత్​వేల్స్​ రాష్ట్రంలోని పలు నగరాల్లో ఆరు వారాలుగా లక్​డౌన్​ కొనసాగుతోంది. 207 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. తన కుమారుడి పాఠశాల కరోనా క్లస్టర్​గా మారిన క్రమంలో తాను ఐసోలేషన్​లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్​ డట్టోన్​. పార్లమెంట్​ సమావేశాలకు వర్చువల్​గా హాజరవుతానని చెప్పారు.

జర్మనీలో ఆందోళన- 600 మంది అరెస్ట్​

ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యలకు వ్యతిరేకంగా బెర్లిన్​లో వందల మంది నిరసనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం ఉన్నప్పటికీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. దీంతో పోలీసులతో ఘర్షణ తలెత్తింది. 600 మంది నిరసనకారులను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఆందోళనల నేపథ్యంలో బెర్లిన్​ వీధుల్లో సుమారు 2వేల మంది బలగాలను మోహరించారు.

జర్మనీలో డెల్టా వేరియంట్​ కారణంగా ఆదివారం 2,097 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: 'డెల్టాతో దారుణంగా మారనున్న పరిస్థితులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.