ETV Bharat / international

కరోనా చికిత్సలో ముందడుగు- తొలి రోగిపై ఔషధం​ ప్రయోగం! - cytokine storm

కరోనా చికిత్స మూడో దశ పరిశోధనలో భాగంగా రోగికి లెన్జిలుమాబ్ తొలి డోస్​ ఇచ్చినట్లు ప్రకటించింది కాలిఫోర్నియాకు చెందిన బయోఫార్మాస్యూటికల్​ సంస్థ హ్యూమానిజెన్​. కొవిడ్​-19తో అధికంగా ప్రభావితమైన రోగులకు ఈ యాంటీబాడీతో చికిత్స చేసేందుకు ఇప్పటికే ఎఫ్​డీఏ అనుమతించిందని తెలిపింది.

Lenzilumab
తొలి రోగిపై లెన్జిలుమాబ్​ ప్రయోగం
author img

By

Published : May 8, 2020, 12:54 PM IST

కరోనా వైరస్ చికిత్సలో మరో ముందడుగు వేసినట్లు అమెరికాకు చెందిన బయోఫార్మాస్యూటికల్​ సంస్థ హ్యూమానిజెన్​ ప్రకటించింది. కొవిడ్​-19లోని సైటోకైన్​ స్టార్మ్​ను లెన్జిలుమాబ్ (జీఎంసీఎస్​ఎఫ్​-గ్రాన్యులోసైట్​ మాక్రోఫేజ్​ కాలనీ స్టిమ్యులేటింగ్​ ఫ్యాక్టర్​) మోనోక్లోనల్​ యాంటీబాడీని తొలి కరోనా రోగిపై ప్రయోగించినట్లు వెల్లడించింది. ఎఫ్​డీఏ ఇప్పటికే అనుమతించిన మూడో దశ పరిశోధనలో భాగంగా ఈ ప్రయోగం చేసినట్లు వివరించింది.

" కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రోగులలో ప్రాణాంతక లక్షణాలను నివారించే ఉద్దేశంతో లెన్జిలుమాబ్​పై పరిశోధన చేస్తున్నాం. మూడవ దశ ద్వారా లెన్జిలుమాబ్​ను మరింత అభివృద్ధి చేసేందుకు మా భాగస్వామి సీటీఐతో పాటు అమెరికాలోని కొన్ని అగ్ర సంస్థలు, వైద్యులతో కలిసి పనిచేస్తున్నాం. లెన్జిలుమాబ్​తో చికిత్స పొందిన రోగుల్లో మంచి ఫలితాలతో మాకు ప్రోత్సాహం లభిస్తోంది. జీఎం-సీఎస్​ఫ్​ను గతంలో ఐఎల్​-6, ఐఎల్​-1, టీఎన్​ఎఫ్​-ఆల్ఫా సైటోకైన్​​ స్టార్మ్​లపై ప్రయోగించాము. జీఎం-సీఎస్​ఎఫ్​ను తటస్థం చేయటం ద్వారా సైటోకైన్​ స్టార్మ్​ను నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు."

- డా. కామెరోన్​ డ్యురెంట్​, సీఈఓ, హ్యూమానిజెన్​

జీఎం-సీఎస్​ఎఫ్​ తటస్థం చేయటం ద్వారా సైటోకైన్​ స్టార్మ్​ను నిరోధించటంపై తమ సంస్థ ఒక్కటే గత మూడేళ్లుగా పని చేస్తోందని తెలిపారు కామెరోన్​. ఈ విషయంలో పలు గుర్తింపు పొందిన అధ్యయనాలు ఉన్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.