ETV Bharat / international

అమెరికాలో రోజుకు లక్ష కరోనా కేసులు!

అమెరికాలో త్వరలోనే రోజుకు లక్ష కరోనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు అంటువ్యాధుల నిపుణులు డాక్టర్​ ఆంథోని ఫౌచీ. ప్రజలు ఆరోగ్య ప్రమాణాాలు పాటించకపోతే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజుకు 40వేల మందికిపైగా కొత్తగా వైరస్​ బారిన పడుతున్నారని గుర్తు చేశారు.

Fauci: US could reach 100,000 new cases a day
అమెరికాలో ఒక్కరోజులో లక్ష కరోనా కేసులు!
author img

By

Published : Jul 1, 2020, 5:02 AM IST

Updated : Jul 1, 2020, 6:58 AM IST

ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో దాదాపు 40వేల మంది వైరస్​ బారిన పడుతున్నారు . ప్రజలు ఆరోగ్య సూచనలు, మార్గదర్శకాలను విస్మరిస్తే ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య లక్షకు చేరుతుందని అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్​ డాక్టర్​ ఆంథోని ఫౌచీ హెచ్చరించారు.

పాఠశాలలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభించాలనే విషయంపై సెనేట్లో చర్చ సందర్భంగా ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ కేసుల సంఖ్యను కొన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా అంచనా వేయలేమని చెప్పారు.

"ప్రస్తుతం దేశంలో రోజుకు 40వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కరోనా కేసులు తగ్గించడంలో పురోగతి సాధించిన ప్రాంతాలతో సహా ఇటీవల వైరస్​ వ్యాప్తి ప్రారంభమైన ప్రాంతాలు.. దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందుకు ఆందోళన చెందుతున్నాను."

-డాక్టర్​ ఆంథోని ఫౌచీ

ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు ఫౌచీ.

ఇదీ చూడండి: ఇరాన్​లో భారీ పేలుడు.. 13 మంది దుర్మరణం

Last Updated : Jul 1, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.