ETV Bharat / international

పీఠం కోసం ఆఖరి పోరాటం- రంగంలోకి సైన్యం!

author img

By

Published : Jan 4, 2021, 1:34 PM IST

అధ్యక్ష ఫలితాలపై ప్రశ్నలు, అనుమానాలు, రీకౌంటింగ్​లు, కోర్టులో పిటిషన్​లు, ఫిర్యాదులు.. మొత్తం ముగిసిపోయాయి. చివరికి అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్​ అని తేలింది. అయినా ట్రంప్​ ఇంకా తన ఓటమిని అంగీకరించడం లేదా? ఎన్నికల వివాదాల్ని తేల్చేందుకు ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నారా? అసలేం జరుగుతోంది?

Trump
పీఠం కోసం ఆఖరి పోరాటం- రంగంలోకి సైన్యం!

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరు, ఫలితాలపై డొనాల్డ్​ ట్రంప్​ చేసినన్ని ఆరోపణలు ఇప్పటివరకు ఏ అధ్యక్షుడూ చేసి ఉండరు. ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందని, ఫలితాలు మార్చేశారని, తానే విజయం సాధించానని.. ఇలా ఓటమిని ఒప్పుకోకుండా ట్రంప్​ చేసిన హడావుడికి ప్రపంచం ముందు అభాసుపాలయ్యారు. ఇక చివరగా ఎన్నికల వివాదాలను పరిష్కరించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు ట్రంప్​ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా రక్షణశాఖ మాజీ మంత్రులు 10 మంది ఆరోపించారు. అలాంటి పనులకు పాల్పడవద్దని ట్రంప్​కు తీవ్ర హెచ్చరికలు చేశారు. వాషింగ్టన్​ పోస్ట్​లో వీరి పేరు మీద వ్యాసం ప్రచురితమైంది.

"ప్రశ్నలు, ఫలితాల సమయం అయిపోయింది. ఇక మిగిలింది పద్ధతి ప్రకారం ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు లెక్కించి ప్రకటించడమే. ఇలాంటి సమయంలో అమెరికా సైనిక బలగాలను ఎన్నికల వివాదాల్ని పరిష్కరించేందుకు వినియోగించాలనుకోవడం చాలా ప్రమాదకరం, చట్ట వ్యతిరేకం. ఎవరైనా సైన్యాధికారులు ఇందుకు ఆదేశించినా, పనిచేసినా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. నేరపరమైన దర్యాప్తును ఎదుర్కోవాల్సి వస్తుంది."

- వాషింగ్టన్​ పోస్ట్​ కథనం

అధ్యక్ష ఫలితాల్లో గెలుపు ఎవరిదో ఇప్పటికే తేలిందని ట్రంప్..​ జనవరి 20న అధికార మార్పిడికి సహకరించాలని వారు కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ట్రంప్​ చేసిన ఆరోపణలను జాయింట్​ చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ జనరల్​ మార్క్​ మిల్లే సహా పలువురు రక్షణ అధికారులు ఇప్పటికే ఖండించారు. అమెరికా అధ్యక్షుడి ఫలితాల విషయంలో జోక్యం చేసుకునే అధికారం సైన్యానికి లేదని బహిరంగంగా తెలిపారు. బలగాలు రాజ్యాంగానికి మాత్రమే బద్ధులని... ఏ నాయకుడికి, పార్టీకి కాదని తేల్చిచెప్పారు.

సజావుగా జరగాలి..

తదుపరి అధ్యక్షుడు జో బైడెన్​కు అధికారాన్ని అప్పజెప్పే ప్రక్రియ సజావుగా జరిగేలా ట్రంప్​ వ్యవహరించాలని ఈ 10 మంది సూచించారు.

ట్రంప్​ నియమించిన పెంటగాన్​ అధికారులు అధికార మార్పిడి ప్రక్రియకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బైడెన్ ఇప్పటికే​ ఆరోపించారు.

ఇరాన్​తో జాగ్రత్త..

ఇరాన్​ అత్యున్నత మేజర్​ జనరల్​ ఖాసీం సులేమానీని అమెరికా బలగాలు హతమార్చి ఆదివారానికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే ఈ చర్యకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని ఇరాన్​ చేసిన హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని మాజీ మంత్రులు ట్రంప్​కు సూచించారు. అయితే ఇరాన్..​ అమెరికాపై దూకుడుగా వ్యవహరిస్తే సైనిక ఆపరేషన్​కు తాము వెనుకాడబోమని ట్రంప్​ పలుమార్లు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.