ETV Bharat / international

Britney Spears: 'నా తండ్రి నుంచి విముక్తి కల్పించండి' - పాప్​ సింగర్​

తన తండ్రితో తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నట్లు చెప్పింది ప్రముఖ పాప్​ సింగర్​ బ్రిట్నీ స్పియర్స్(Britney Spears)​. 13 ఏళ్లుగా ఆయనతో ఇబ్బందులు పడుతున్నానని వివరించింది. తన జీవితాన్ని తనకు తిరిగెచ్చేయాలని కోర్టును వేడుకుంది. బ్రిట్నీకి మద్దతుగా ఆమె అభిమానులు.. గతంలో ఫ్రీబ్రిట్నీ అనే ఆన్​లైన్​ ఉద్యమం కూడా ప్రారంభించారు. ఆమె ఇలా ధైర్యంగా మాట్లాడటం చూసి.. పలువురు మెచ్చుకుంటున్నారు.

Britney Spears
బ్రిట్నీ స్పియర్స్​
author img

By

Published : Jun 24, 2021, 8:00 PM IST

తండ్రి వల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు పేర్కొంది ప్రముఖ పాప్​ సింగర్​ బ్రిట్నీ స్పియర్స్(Britney Spears)​. తన ఆలోచనలు, వ్యక్తిగత జీవితంపై ఆయన నియంత్రణ నుంచి విముక్తి కల్పించాలని అభ్యర్థించింది. ఇన్నేళ్ల నరకం చాలని, తన జీవితాన్ని తనకు తిరిగి ఇప్పించాలని న్యాయస్థానాన్ని వేడుకుంది.

తండ్రికి తన సర్వ హక్కులు కల్పించే కన్జర్వేటివ్​షిప్​ను రద్దు చేయాలని కోరింది. గతంలో బ్రిట్నీ(Britney Spears) మానసిక సమస్యల బారినపడ్డారు. ఓసారి గుండుతో కూడా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అప్పటినుంచి.. ఆమె వ్యవహారాలను చూసుకునేందుకు కన్జర్వేటర్​గా(సంరక్షకుడు) బ్రిట్నీ తండ్రిని నియమించింది కోర్టు.

Britney Spears pleads court
పాప్​ సింగర్​ బ్రిట్నీ స్పియర్స్​
Britney Spears pleads court
బ్రిట్నీ స్పియర్స్​కు మద్దతుగా

తాజాగా.. 20 నిమిషాల వీడియోలో ఆమె కోర్టును ఇలా వేడుకోవడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 13 సంవత్సరాలు ఇష్టాలకు వ్యతిరేకంగా ఉండాల్సి వచ్చిందని, మాదక ద్రవ్యాలకు బానిసయ్యానని పేర్కొంది.

Britney Spears pleads court
బ్రిట్నీ స్పియర్స్​

''నా జీవితాన్ని నాకు తిరిగిచ్చేయండి. నేనెవరి బానిసగానో ఉండేందుకు ఇక్కడ లేను. నేను తీవ్ర నిరాశలో ఉన్నా. నాకు సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. నేను పనిచేయాలంటే.. కన్జర్వేటర్​షిప్​ను తొలగించాలి. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది.''

- బ్రిట్నీ స్పియర్స్​, పాప్​ సింగర్​

2008 నుంచి బ్రిట్నీ.. ఆర్థిక లావాదేవీలు సహా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యవహారాలన్నీ ఆమె తండ్రి జేమీ స్పియర్స్​ చూస్తున్నారు. తండ్రి చెర నుంచి విముక్తి కల్పించాలని.. గతేడాదే న్యాయపర ప్రక్రియను మొదలుపెట్టింది బ్రిట్నీ. దీనిపై లాస్​ఏంజెలిస్​ కోర్టు జడ్జి.. ప్రశంసలు కురిపించారు. అలా బహిర్గతంగా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలని కొనియాడారు.

Britney Spears pleads court
బ్రిట్నీ స్పియర్స్​

ఆయనకు ఎంతో ఇష్టం..

బ్రిట్నీ ఇంత బాధపడుతుండటం తమకు తెలియదని, ఆయనకు తన కూతురంటే ఎంతో ఇష్టమని కోర్టులో చెప్పారు ఆమె తండ్రి తరఫున వాదించిన న్యాయవాది.

కొన్నేళ్లుగా 'FreeBritney' పేరుతో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆన్​లైన్​ ఉద్యమం కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బ్రిట్నీకి మద్దతుగా చాలా మంది ఫ్యాన్స్​ కోర్టు బయట నినాదాలు చేశారు. పింక్​ దుస్తులు ధరించి, ఫ్రీబ్రిట్నీ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలు నిర్వహించారు. వందలాది మంది.. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో సంఘీభావం తెలిపారు.

Britney Spears pleads court
బ్రిట్నీ మద్దతుదారులు
Britney Spears pleads court
ఫ్రీబ్రిట్నీ అంటూ ర్యాలీ

ఇవీ చదవండి: Vijayashanti: విజయశాంతికి అప్పట్లోనే కోట్లలో రెమ్యునరేషన్!

MAA Election: 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.