ETV Bharat / international

భూగ్రహానికి మరో ముప్పు.. 2068లోనే అంతమా?

అంతరిక్షం నుంచి మరో ఆస్టరాయిడ్ భూమివైపు దూసుకొస్తోంది. 3 ఫుట్​బాల్​ మైదానాల సైజులో ఉండే 'అపోఫిస్' అనే గ్రహశకలం భారత్​ను ఢీకొనే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది 2029లో భూమికి సమీపంగా వస్తుందని.. 2068లో మాత్రం కచ్చితంగా పుడమిని తాకే అవకాశముందని అంటున్నారు.

Apophis news
భూగ్రహానికి మరో ఆస్టరాయిడ్ ముప్పు.. 2068లోనే అంతమా?
author img

By

Published : Nov 10, 2020, 5:28 AM IST

భూగ్రహం అంతం కానుందని ఎన్నో ఏళ్లుగా ప్రచారం నడుస్తోంది. యుగాంతం పేరిట ఇప్పటివరకు ఎన్నో తేదీలు చక్కర్లు కొట్టాయి. అయితే భూమి వినాశనం అయ్యేది 2068లోనే అంటూ తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. దీనంతటికి కారణం ఆ సంవత్సరంలోనే భూమిని ఓ గ్రహశకలం ఢీకొట్టనుందని హవాయి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెప్పటం.

ఆ ఆస్టరాయిడ్​కు ఈజిప్టు దేవుడు ఖోస్​ పేరును సూచించేలా 'అపోఫిస్'​ అని నామకరణం చేశారు. భూమికి అతిదగ్గరగా వస్తున్న రెండో గ్రహశకలం ఇదేనట.

మరో తొమ్మిదేళ్లలోనే...

అపోఫిస్​ను 2004లోనే గుర్తించారు శాస్త్రవేత్తలు. వివిధ అబ్జర్వేటరీలు, ప్రసిద్ధ సుబారు టెలిస్కోప్ సహాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు 2029, ఏప్రిల్​ 13న నాటికి ఇది భూమికి అత్యంత సమీపంగా వస్తుందని అంచనా వేశారు. అందుకే దీనిని ప్రమాదకర గ్రహశకలంగా పరిగణిస్తున్నారు. 2029లో ఇది భూమికి 400 మీటర్ల దగ్గర వరకు వచ్చినా.. ఢీకొట్టకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆ సమయంలో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అమెరికాను దాటుతుందని.. అది ప్రజలంతా చూడవచ్చని నాసా చెప్పింది. దాదాపు 1,120 అడుగుల వైడల్పులో ఉంటుందట. అంటే సుమారు మూడున్నర ఫుట్​బాల్​ మైదానాల పరిమాణమంత.

2068లో మాత్రం పక్కా..!

అపోఫిస్​ 2029లో మిస్​ అయినా 2068లో మాత్రం భూమిని తాకొచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. యార్కోవ్​స్కీ అనే ఎఫెక్ట్​ కారణంగానే ఇలా జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.