ETV Bharat / international

లూసియానా ప్రైమరీలో ట్రంప్, బైడెన్ ఘనవిజయం

లూసియానా ప్రైమరీలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల తరపున జో బైడెన్ విజయం సాధించారు. నవంబర్​లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే డెమోక్రాట్ల తరపున బైడెన్ ఎంపిక కాగా... రిపబ్లికన్ల తరపున పోటీ చేయడానికి ట్రంప్ సర్వసన్నద్ధం అవుతున్నారు.

Donald Trump, Joe Biden win Louisiana's presidential pri
లూసియానా ప్రైమరీలో ట్రంప్, బిడెన్ ఘనవిజయం
author img

By

Published : Jul 12, 2020, 10:19 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్... లూసియానా ప్రైమరీలో ఘనవిజయం సాధించారు.

శనివారం జరిగిన లూసియానా రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో... ట్రంప్​నకు సరైన పోటీ ఇచ్చే అభ్యర్థులే కరువయ్యారు. నలుగురు జీఓపీ అభ్యర్థులు డొనాల్డ్​కు ఎదురునిలిచినా, ఓటమి పాలయ్యారు.

లూసియానా ఎన్నికల్లో బైడెన్​.. 13 మంది ఇతర డెమోక్రాట్లను ఎదుర్కొని విజయం సాధించారు. ఆయన ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజారిటీ సాధించి... అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్​ పార్టీ నామినీగా ఎన్నికయ్యారు.

అసంబద్ధం!

అమెరికా ప్రెసిడెన్షియల్ చివరి ప్రైమరీల్లో లూసియానా ఒకటి. ఏప్రిల్ 4నే ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఈ ఎన్నికలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి.

అయితే మిగతా రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలకు.. లూసియానా ప్రైమరీకి మధ్య నెలలపాటు గ్యాప్ వచ్చింది. అంటే ప్రధాన పార్టీల నామినీల ఎంపికకు... ఈ ఎన్నిక నామమాత్రమే.

కరోనా కారణంగా ఈసారి ఓటర్లకు.. ముందస్తు ఓటింగ్, మెయిల్-ఇన్ బ్యాలెట్ అవకాశాలను కల్పించారు.

ఇదీ చూడండి: తొలిసారి మాస్క్​తో దర్శనమిచ్చిన ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.