ETV Bharat / international

ట్రంప్​ సమాచార మాధ్యమం మూసివేత

'ఫ్రమ్​ ది డెస్క్​ ఆఫ్​ డొనాల్డ్​ జే ట్రంప్'​ పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్​ ప్లాట్​ఫార్మ్​ ప్రారంభించి నెలరోజులు ముగియకముందే మూసివేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దీన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చే ఆలోచన లేదని ట్రంప్ కార్యదర్శి జేసన్ మిల్లర్ స్పప్టం చేశారు.

donald trump
డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు
author img

By

Published : Jun 3, 2021, 10:20 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రారంభించిన కమ్యూనికేషన్ ప్లాట్​ఫార్మ్​ను మూసివేశారు. 'ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జే ట్రంప్' పేరుతో ట్రంప్​ ఈ సమాచార మాధ్యమాన్ని మే4న ప్రారంభించారు.

నెలరోజులు కూడా గడవకముందే ఈ మాధ్యమాన్ని నిలిపివేస్తుండటంపై ఆయన కార్యదర్శి జేసన్ మిల్లర్ మాట్లాడారు. తిరిగి దీన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఇంకా ఈ పేజీని వీక్షించాలనుకునే వారు తమ సమాచారం ఇస్తే ఈమెయిల్ లేదా మెసేజ్​ ద్వారా అప్​డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

గతంలో ట్రంప్ ఫేస్​బుక్, ట్విట్టర్ ఖాతాపై నిషేధం విధించిన నేపథ్యంలో.. తన మద్దతుదారులతో నేరుగా మాట్లాడేందుకు ఈ మాధ్యమాన్ని ప్రారంభించారు. ఈ ప్లాట్​ఫార్మ్​ సామాజిక మాధ్యమం కాదని ఆయన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మాధ్యమంలో ట్రంప్​ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన చేసిన ప్రకటనలను పొందుపరిచారు.

ఇదీ చదవండి:Mehul Choksi:​ చోక్సీ బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.