ETV Bharat / international

'ఛోక్సీ భవిష్యత్తును తేల్చేది కోర్టులే' - డొమినికా న్యూస్

పీఎన్​బీ కుంభకోణంలో 13వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీని.. 'భారతీయుడు' అని సంబోధించారు డొమినికా ప్రధాని రూజ్​వెల్ట్ స్కెర్రిట్. ఆయన భవిష్యత్తు ఏమిటో కోర్టులో చెబుతాయని వ్యాఖ్యానించారు.

mehul choksi
మెహుల్ ఛోక్సీ, పీఎన్​బీ స్కాం
author img

By

Published : Jun 8, 2021, 1:12 PM IST

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ ఛోక్సీ.. భారతీయుడు అని సంబోధించారు డొమినికా ప్రధాని రూజ్​వెల్ట్ స్కెర్రిట్. ఛోక్సీ భవిష్యత్తేంటో కోర్టులు తేలుస్తాయని వ్యాఖ్యానించారు. బెయిల్​ కోసం వేచిచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఛోక్సీ హక్కులకు ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం.. ఛోక్సీని భారత్​కు పంపించాలన్న పిటిషన్​పై విచారణను డొమినికా కోర్టు వాయిదా వేసింది. దీంతో ఛోక్సీకి తాత్కాలికంగా ఉపశమనం లభించింది.

"భారతీయ పౌరుడి విషయం కోర్టులో ఉంది. ఆయన భవిష్యత్తు ఏమిటో కోర్టులే చెబుతాయి. దీనిపై విచారణ త్వరగా జరిగేలా చూస్తాం. ఆయన హక్కులకు ప్రాధాన్యం ఇస్తాం. దీనిపై ఆంటిగ్వాలో ఏం జరుగుతుందో, భారత్​లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి మాకు లేదు."

--రూజ్​వెల్ట్​ స్కెర్రిట్, డొమినికా ప్రధాని.

మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ.. కొద్దిరోజులకు డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదిస్తుండగా.. అక్రమంగానే ప్రవేశించారని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

భారత్​ నుంచి పారిపోలేదు: మెహుల్‌ చోక్సీ

Mehul Choksi: వేల కోట్లకు ట్రాప్ వేసిన అమ్మాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.