ETV Bharat / international

ఈ ఏడాది ఎక్కువగా వాడిన పదం- 'పాండెమిక్​' - Pandemic

కరోనా కారణంగా మరో పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 'పాండెమిక్'​ను ఈ ఏడాదిలో ఎక్కువగా వాడిన పదంగా గుర్తించింది డిక్షనరీ.కామ్​. 'పాండెమిక్​'ను 2020కి గానూ వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​గా ప్రకటించింది.

Dictionary.com picks 'pandemic' as its 2020 word of the year
ఈ ఏడాదిలో ఎక్కువగా వాడిన మరో పదం- 'పాండమిక్​'
author img

By

Published : Dec 1, 2020, 5:43 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించిన నాటి నుంచి 'పాండెమిక్​' పదాన్ని ఎక్కువగా వాడినట్లు డిక్షనరీ.కామ్​ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)... కొవిడ్​ను మహమ్మారిగా ప్రకటించిన నాటి నుంచి 'పాండెమిక్​'ను అత్యధికంగా వాడినట్లు డిక్షనరీ.కామ్​ వెల్లడించింది. 2020గానూ 'పాండెమిక్​'ను వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​గా ప్రకటించింది. డబ్ల్యూహెచ్​ఓ... కరోనాను ప్రకటించిన రోజు(మార్చి 11) ఈ పదాన్ని 13,500 శాతం కంటే ఎక్కువగా వెబ్​సైట్​లో శోధించినట్లు పేర్కొన్నారు సీనియర్​ రిసెర్చ్​ ఎడిటర్​ జాన్ కెల్లీ.

పాండెమిక్​ పదం వినియోగం నెల నెలకు సాధారణం కంటే 1,000 శాతం ఎక్కువగా పెరిగింది. దాదాపు సగం సంవత్సరానికి అన్ని శోధనల్లో మొదటి 10శాతంలో ఉంది. మరో నిఘంటువు మెరియం-వెబ్‌స్టర్​ కూడా పాండెమిక్​ను వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​గా ఎంపిక చేసుకుంది.

పాండెమిక్​ను ఒక వ్యాధిగా నిర్వచించింది డిక్షనరీ.కామ్​​. 'మొత్తం దేశం, ఖండం లేదా ప్రపంచం అంతటా వ్యాపించింది; పెద్ద ప్రాంతంలో అంటువ్యాధి' అని పేర్కొంది.

లాటిన్, గ్రీక్​ మూలాలు..

పాండెమిక్​ అనే పదం 'పాండెమోస్‌' అనే లాటిన్​, గ్రీకు పదం నుంచి పుట్టింది. దీని అర్థం 'సాధారణ, ప్రజలు'. దీనిలో 'పాన్​' అంటే 'అన్నీ' అని 'డెమోస్' అంటే 'ప్రజలు' అని అర్థం. డచ్​లో జన్మించిన వైద్యుడు గిడియాన్ హార్వే వైద్య భాషలో పాండెమిక్​ను 1660లో వైద్య కోణంలో ఆంగ్లంలోకి ప్రవేశించినట్లు కెల్లీ చెప్పారు. ప్రజాస్వామ్యం అనే పదానికి 'డెమోస్' కూడా ఆధారం అని ఆయన గుర్తుచేశారు.

ఇదీ చూడండి: ఈ ఏడాది ఎక్కువగా వాడిన పదం.. 'కరోనావైరస్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.