ETV Bharat / international

ట్రంప్​కు మరో షాక్- సెనేట్​పై​ డెమొక్రాట్ల పట్టు

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు మరో షాక్ తగిలింది. రిపబ్లికన్​లకు కీలక రాష్ట్రమైన జార్జియాలో డెమొక్రాట్​ అభ్యర్థులు విజయం సాధించారు. ఫలితంగా అమెరికా సెనేట్​పై ఆ పార్టీ పట్టు సాధించింది.

Biden's party dominates the Senate
సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్​కు షాక్
author img

By

Published : Jan 7, 2021, 12:59 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు​ పదవీ కాలం ముగిసే చివరి రోజుల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సెనేట్​లోనూ డెమొక్రాటిక్ పార్టీ అధిపత్యాన్ని చేజిక్కించుకుంది. దీనితో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు కాంగ్రెస్​ ఉభయ సభల్లో మెజారిటీ దక్కింది.

సార్వత్రిక ఎన్నికల్లో.. రిపబ్లికన్లకు కీలక రాష్ట్రమైన జార్జియాలో ఇద్దరు డెమొక్రాట్లు విజయం సాధించి బైడెన్​కు ఈ మెజారిటీ కట్టబెట్టారు. 100 మంది సభ్యులున్న సెనేట్​లో ఇరు పార్టీలు 50-50 సీట్లు దక్కించుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న భారత మూలాలున్న కమలా హారిస్​ వేసే ఓటుతో... ఏ నిర్ణయమైనా డెమొక్రాట్లకు అనుకూలంగా ఉండనుంది.

ఉభయ సభల్లో ఆధిపత్యం దక్కడం ద్వారా.. కీలక నియామకాలకు, తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బైడెన్​కు అవకాశం దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.