ETV Bharat / international

కరోనా సాయం కోసం ఫిక్కీతో యూనిసెఫ్​ జట్టు - COVID-19: UNICEF, FICCI join hands for action plan to support vulnerable populations

భారత్​లో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు, చిన్నారులకు అండగా నిలిచే కార్యక్రమం కోసం ఫిక్కీతో జట్టుకట్టింది ఐక్యరాజ్యసమితి పిల్లల విభాగం యూనిసెఫ్​. వ్యాపారాలు, ఉపాధి, పిల్లలు, కుటుంబాలపై దీర్ఘకాలికంగా పడే నష్టాన్ని నివారించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ప్రకటించింది.

UNICEF, FICCI join hands
భారత్​లో కరోనా సాయానికి ఫిక్కీతో యూనిసెఫ్​ జట్టు
author img

By

Published : Jul 14, 2020, 1:05 PM IST

భారత్​లో కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఉపాధి అవకాశాలు కుంటుపడి ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో దేశంలో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు, పిల్లలకు సాయం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఐక్యరాజ్య సమితికి చెందిన చిన్నారుల విభాగం యూనిసెఫ్​. కరోనా సమయంలో.. విపత్తు తర్వాత పీడిత ప్రజలు, పిల్లలకు అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఫిక్కీ(ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ, ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​)తో భాగస్వామి అయినట్లు ప్రకటించింది.

ఈ కార్యక్రమానికి భారత్​లోని ప్రముఖ ప్రకటనల సంస్థ ఓగ్లివీ.. సృజనాత్మక కథనాన్ని సిద్ధం చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది యూనిసెఫ్​.

" వ్యాపార కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, ముఖ్యమైన వనరులు, వ్యక్తిగతంగా, పిల్లులు, కుటుంబాలపై దీర్ఘకాలికంగా పడే నష్టాన్ని నివారించేందుకు ఈ భాగస్వామ్యం సాయం చేస్తుంది. ఈ మహమ్మారి ప్రభావంలో చిన్నారులు కనబడని బాధితులు. వారిపై అధికంగా ప్రభావం ఉంటుంది."

- యూనిసెఫ్​.

చిన్నారులపై కరోనా ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని తెలిపారు యూనిసెఫ్​ భారత అధికార ప్రతినిధి డా.యాస్మిన్​ అలీ హక్​

" పిల్లలపై కొవిడ్​-19 ప్రభావం ప్రమాదకరమైంది. అది జీవితకాలం ఉంటుంది. లక్షల మంది పిల్లలు కీలకమైన అభివృద్ధి, అభ్యాస సమయాన్ని కోల్పోతారు. దోపిడీకి గురయ్యే పిల్లలు, యువకుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు పిల్లలు ఆరోగ్యం, పోషకాహార స్థితిలో సాధించిన లాభాల్లో క్షీణతను చూడొచ్చు."

- డా.యాస్మిన్​ అలీ హక్​, యూనిసెఫ్​ అధికార ప్రతినిధి

తక్షణ చర్యలు అవసరం..

యూనిసెఫ్​తో భాగస్వామ్యంపై కీలక విషయాలు వెల్లడించారు ఫిక్కీ అధ్యక్షురాలు సంగీత రెడ్డి. పిల్లలందరికీ శాంతియుత, స్థిర, సంపన్న భవిష్యత్తును పొందేందుకు వ్యాపారులు, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజంతో సహా భాగస్వామ్యులందరి నుంచి తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు.

ఫిక్కీ ఫౌండేషన్​..

ఈ ప్రచారానికి మద్దతను కూడగట్టేదుకు ఫిక్కీ ఆధ్వర్యంలో నడుస్తోన్న సామాజిక, ఆర్థిక అభివృద్ధి ఫౌండేషన్​ (ఎస్​ఈడీఎఫ్​) ప్రయత్నాలు చేస్తోంది. తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు, చిన్నారులకు సాయం చేసే నిధుల సమీకరణకు వివిధ రంగాల నుంచి భాగస్వామ్యాలను కూడగడుతోంది. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: ఏటా 100 కోట్ల మంది చిన్నారులపై హింస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.