ETV Bharat / international

2021 ప్రథమార్ధానికి కరోనా వ్యాక్సిన్​ సిద్ధం! - కొవిడ్ వ్యాక్సిన్

ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అంచనా వేశారు. ఈ వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే.. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు.

COVID-19: Top US doctor Fauci cautiously optimistic over vaccine development by early 2021
2021 ప్రథమార్థం నాటికి కరోనా వ్యాక్సిన్​ సిద్ధం!
author img

By

Published : Jul 9, 2020, 1:10 PM IST

అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ... కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో తాను ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధానికి కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని అయన అభిప్రాయపడ్డారు.

'ఇన్నోవేషన్​ అండ్ రీసెర్చ్ ద్వారా కొవిడ్​ను ఎదుర్కోవడం: కరోనా సంక్షోభం నుంచి నేర్చుకున్న పాఠాలు' అనే అంశంపై ఆన్​లైన్ సెషన్​లో మాట్లాడుతూ ఫౌచీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులను ఒక్కచోటకు చేర్చుతూ... ఈ ఆన్​లైన్ సెషన్​ను ఐక్యరాజ్యసమితి అకడెమిక్ ఇంపాక్ట్ (యూఎన్​ఐఐ) నిర్వహిస్తోంది.

పరస్పర సహకారంతో...

నేషనల్​ ఇన్స్​స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్​గా ఉన్న ఫౌసీ... కొవిడ్ మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవాలంటే.. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం, పారదర్శకత తప్పనిసరి అని స్పష్టంచేశారు.

అనుభవం పాఠాలు నేర్పుతుంది..

"కరోనా సంక్షోభం నుంచి మనం నేర్చుకుంటున్న పాఠాలు... భవిష్యత్​లో ఇలాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని మనకు అందిస్తాయి. అలాగే మంచి ప్రజారోగ్య చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుంది."

- ఆంటోని ఫౌచీ, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు

సశాస్త్రీయంగా

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఓ వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఫౌచీ తెలిపారు. ప్రస్తుతం 5 నుంచి 7 వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ట్రయల్స్​లో ఎండ్ పాయింట్, స్టాండర్డ్, సింగిల్ డేటా, సేఫ్టీ మానిటరింగ్ బోర్డు, ఇమ్యునోలాజికల్ పారామితులు ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా ఒక అధ్యయాన్ని మరో అధ్యయనంతో అనుసంధానం చేయడానికి వీలవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి కొన్ని వ్యాక్సిన్లపై 2 దశల క్లినికల్ ట్రయల్ పూర్తి అయ్యాయని... జులై చివరి నాటికి వీటిపై మూడో దశ ట్రయల్స్​ కూడా నిర్వహించవచ్చని ఫౌచీ తెలిపారు. మరికొన్ని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో క్లినికల్ ట్రయల్స్​కు వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు.

"మోడెర్నా కరోనా వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఇది మాలో ఆశలు రేపుతోంది. అయితే ఈ టీకా సురక్షితమా? ప్రభావవంతంగా పనిచేస్తుందా? అనే ప్రశ్నలకు ఇప్పుడే జవాబు చెప్పలేం."

30 వేల మందితో భారీ క్లినికల్ ట్రయల్

మోడెర్నా బయోటెక్నాలజీ సంస్థ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ రెండు దశల క్లినికల్ ట్రయల్స్​ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. త్వరలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో సుమారు 30 వేల మంది పాల్గొంటారని సమాచారం.

ఇదీ చూడండి: ఆయుర్వేద మంత్రం: భారత్​-అమెరికా క్లినికల్​ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.