ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ 2 కోట్ల 72 లక్షల మందికిపైగా మహమ్మారి సోకింది. తాజాగా 2 లక్షల 31వేలకు పైగా కొత్త కేసుల బయటపడ్డాయి. మరో 4,129 మంది వైరస్‌తో ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 8.87 లక్షలకు పెరిగింది.
కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 1.93 కోట్ల మంది కోలుకున్నారు. మరో 70 లక్షల 29వేల యాక్టివ్ కేసులున్నాయి.
- మొత్తం కేసులు : 27,283,718
- మొత్తం మరణాలు : 887,305
- యాక్టివ్ కేసులు : 7,029,248
- రికవరీలు : 19,367,165
అమెరికా, బ్రెజిల్‌లలో తగ్గుముఖం
అమెరికాలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 31,110 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 64,60,250కి చేరింది. మరో 432 మంది వైరస్ కారణంగా చనిపోగా.. మృతుల సంఖ్య 1,93,250కి పెరిగింది.
బ్రెజిల్‌లోనూ కరోనా శాంతించినట్లుగా ఉంది. తాజాగా 14,606 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 41,37,606కు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 456 మంది బలవ్వగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,26,686కు చేరింది.
ఆయా దేశాల్లొ కొవిడ్ కేసులు నమోదయ్యాయిలా..
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 6,460,250 | 193,250 |
బ్రెజిల్ | 4,137,606 | 126,686 |
రష్యా | 1,025,505 | 17,820 |
పెరూ | 689,977 | 29,838 |
కొలంబియా | 666,521 | 21,412 |
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ సురక్షితమని తేలేవరకు అనుమతే అడగం'