అత్యంత చౌకగా లభించే కేటలేస్ ఎంజైము... శరీరంలో కరోనా వైరస్ పునరుత్పత్తిని కట్టడి చేసి, కొవిడ్ లక్షణాలను ప్రభావవంతంగా మాయం చేయగలదని తాజా అధ్యయనంలో రూఢి అయింది. ఈ క్రమంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కొవిడ్ రోగుల్లో దీని ప్రభావంపై పరిశోధన సాగించారు.
"కరోనా కారణంగా శరీరంలో వాటిల్లే అంతర్గత వాపులను కేటలేస్ కట్టడి చేయగలదు. దీని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం కారణంగా తెల్లరక్తకణాల్లో సైటోకీన్ల ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. కొవిడ్ బాధితుల్లో ఈ ప్రొటీన్ల సంఖ్య పెరిగితే శరీరం తన సొంత కణాలను నశింపజేసుకునే పరిస్థితి (సైటోకీన్ స్టార్మ్) తలెత్తుతుంది. ఊపిరితిత్తుల వరకూ వ్యాపించి ఉండే వాయుకోశ కణాలకు కూడా కేటలేస్ రక్షణ కల్పిస్తోంది" అని పరిశోధనకర్త యున్‌ఫెంగ్ లూ చెప్పారు.
ఈ ప్రొటీన్‌తో కరోనా చికిత్సను రూపొందించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.