ETV Bharat / international

భారత్​కు అదనపు సాయానికి యూఎస్ కాంగ్రెస్​లో తీర్మానం - భారత్ కు అమెరికా సాయం

కరోనా మహమ్మారిపై పోరులో భారత్​కు అందిస్తున్న సహకారాన్ని వేగవంతం చేయాలని బైడెన్ సర్కారును కోరారు అమెరికా చట్టసభ్యులు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. భారత్​కు అత్యవసరమైన వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

భారత్ కు వేగిర సహకారానికి యూఎస్ కాంగ్రెస్ తీర్మానం
Congressional resolution introduced to support India during COVID19 crisis
author img

By

Published : May 18, 2021, 6:21 AM IST

కొవిడ్​పై భారత్ పోరులో బైడెన్ ప్రభుత్వ సహకారాన్ని వేగవంతం చేసే తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు పలువురు అమెరికా శాసనకర్తలు. దీనిని కాంగ్రెస్ సభ్యులు బ్రాడ్ షెర్మన్, స్టీవ్ ఛాబట్ రూపొందించారు. భారత్​కు అదనంగా అత్యవసరమైన వైద్య పరికరాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటైనర్లు అందించాలని తీర్మానంలో కోరారు.

కరోనా కట్టడిలో భారత ప్రజలకు మద్దతుగా నిలవాలని తీర్మానం పేర్కొంది. అందుకోసం అమెరికా చేస్తున్న కృషిని కొనియాడింది. భారత్​లో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసరమైన వైద్య పరికరాలు, టీకా ముడిసరకులు, ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను బైడెన్ సర్కారు పంపించిందని తీర్మానం పేర్కొంది. ఆరోగ్య రంగంలో భారత్​తో అమెరికాకు ఏడు దశాబ్దాల బంధం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి: భారత్​కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.