ETV Bharat / international

చిన్నారుల ద్వారా నిశ్శబ్దంగా కరోనా వ్యాప్తి

పెద్ద వారి కంటే చిన్నారులే కరోనా వ్యాప్తికి అధికంగా దోహదపడుతున్నారని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కానీ పెద్దల తరహాలో వీరు ఎక్కువగా అనారోగ్యానికి గురి కాకపోవచ్చని తెలిపారు. వైరస్​ను ఇంటికి తీసుకరావటంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు.

Childrens role in spread of virus bigger than thought
చిన్నారుల ద్వారా నిశ్శబ్ద వ్యాప్తి
author img

By

Published : Aug 21, 2020, 7:11 AM IST

కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తిలో చిన్నారులది చాలా పెద్ద పాత్ర అని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. కరోనా ఇన్​ఫెక్షన్ వల్ల పెద్దల తరహాలో వీరు ఎక్కువగా అనారోగ్యం పాలు కాకపోవచ్చని చెప్పారు. అయితే వ్యాధి వ్యాప్తిలోను, వైరస్​ను తమ ఇళ్లను తీసుకురావడంలోనూ వీరి ప్రమేయం ఉంటుందన్నారు.

మసాచు సెట్స్​ జనరల్​ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు.. ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిడ్​-19 కారక సార్స్​కోవ్​-2 దృష్టి పెట్టే ఇమ్యూన్​ రిసెప్టార్లు చిన్నారుల్లో చాలా తక్కువగా ఉంటున్నాయని, అందువల్ల వారు ఆ మహమ్మారి బారిన తక్కువగా పడుతున్నరన్న సిద్దాంతాన్ని ఈ పరిశోధన ఖండించింది. ఈ అధ్యయనంలో 192 మంది చిన్నారులపై దృష్టి పెట్టింది. ఇన్​ఫెక్షన్​ సోకిన పిల్లల శ్వాస నాళాల్లో ఆసుపత్రిపాలైన పెద్దల కన్నా ఎక్కువగా వైరస్​ ఉన్నట్లు గుర్తించారు.

"వారిలో వైరస్​ లోడు ఎక్కువగా ఉండటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇన్​సెక్షన్​ సోకిన మొదటి, రెండు రోజుల్లోనే ఈ పరిస్థితి కనిపించింది. ఆరోగ్యంగా ఉంటూ, చురుగ్గా తిరుగుతున్న చిన్నారుల్లో... తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిపాలైన పెద్దల్లో ఉన్న దాని కన్నా ఎక్కువగా వైరల్​ లోడు ఉంది." అని పరిశోధనకు నాయకత్వం వహించిన లేల్​ యాంకర్​ తెలిపారు. దీన్నిబట్టి చిన్నారులకు ఇన్​ఫెక్షన్​ నుంచి రక్షణ లేదని, వారిలో లక్షణాలు.. ఇన్​ఫెక్షన్​ స్థాయిని సూచించవని స్పష్టమైనట్లు పరిశోధనలో పాలు పంచుకున్న మరో శాస్త్రవేత్త అలెసియా ఫానానో పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు పాఠశాలలు, డే కేర్​ కేంద్రాలు, చిన్నారులు ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల పునఃప్రారంభంపై ప్రభావం చూపుతాయని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.