అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పశ్చిమ ఆసియాలో పర్యటించనున్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం దీర్ఘకాలం కొనసాగేలా చూడడమే ప్రధాన అజెండాగా ఆయా దేశాల నాయకులతో చర్చలు జరపనున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్టు దేశాల నాయకులతో బ్లింకన్ చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. గాజాకు అందాల్సిన తక్షణ సాయంపై పశ్చిమాసియా దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని చెప్పారు.
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన ఘర్షణపై బైడెన్ ప్రభుత్వం అనుసరించిన తీరు మొదట్లో విమర్శలకు తావిచ్చింది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా చట్టసభలు సైతం డిమాండ్ చేశాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణతో అమెరికా తన బాధ్యతను నెరవేర్చినట్లయింది.