ETV Bharat / international

చైనా విషయంలో భారత్​కు అగ్రరాజ్యం సంపూర్ణ మద్దతు - india china

చైనాతో ఘర్షణ విషయంలో భారత్​కు అగ్రరాజ్యం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ, సైనిక ఘర్షణను.. అమెరికా పార్లమెంట్ సభ్యులే కాకుండా ఇతర నేతలు సైతం తప్పుబడుతున్నారు. భారత్​కు సంఘీభావంగా ప్రధానికి లేఖలు రాస్తున్నారు. భారత్​కు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

Bipartisan support in US grows for India against Chinese aggression
చైనా విషయంలో భారత్​కు అగ్రరాజ్యం సంపూర్ణ మద్దతు
author img

By

Published : Aug 1, 2020, 10:40 AM IST

లద్దాఖ్​లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా నుంచి భారత్​కు బలమైన మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ చట్టసభలతో పాటు అగ్రరాజ్యంలోని ఇరు పార్టీ నేతలు చైనా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.

గత కొన్ని వారాలుగా ప్రతినిధుల సభతో పాటు పెద్దల సభ సెనెట్​లో భారత్​కు సంఘీభావంగా సభ్యులు వ్యాఖ్యలు చేశారు. చైనా దూకుడును ఎంగడట్టిన ఉభయ సభల ప్రతినిధులు.. భూభాగాలను స్వాధీనం చేసుకోవాలన్న డ్రాగన్ ప్రయత్నాలకు దృఢంగా నిలబడిందని భారత్​ను ప్రశంసించారు. పార్లమెంట్ వెలుపలా మద్దతు లభిస్తుండటం గమనార్హం.

"చైనా తన సైనిక దూకుడును అంతం చేయాలి. ఈ సంఘర్షణ శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. ఘర్షణ జరిగిన నెలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.. 5 వేల మంది సైనికులను సరిహద్దుకు తరలించింది. ఇదంతా.. దుందుడుకు వైఖరితో దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దును మార్చేందుకేనని అర్థమవుతోంది."

- ఫ్రాంక్ పాల్లోన్, సీనియర్ డెమోక్రటిక్ నేత, ప్రతినిధుల సభలో సభ్యుడు

పార్టీలకతీతంగా..

అగ్రరాజ్యంలో ఓవైపు రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ మధ్య బాహాబాహీ జరుగుతున్నప్పటికీ.. భారత్​ విషయానికొస్తే రెండు పార్టీల నేతలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ట్వీట్లు, బహిరంగ ప్రసంగాలతో పాటు చట్ట సభల వేదికగా భారత్​కు మద్దతు ప్రకటిస్తున్నారు. భారత ప్రధానితో పాటు అమెరికాలోని భారత రాయబారి తరన్​జిత్ సంధుకి లేఖలు రాస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ శాసనకర్తలతో ప్రతీరోజు వర్చువల్​ సమావేశంలో పాల్గొంటున్నారు సంధు. చైనా వ్యతిరేక గళం వినిపిస్తూ కొంతమంది శాసనకర్తలు సంధుకి ఫోన్లు చేశారు.

జడిసేది లేదు

వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికుల మరణంపై రిపబ్లికన్ సెనెటర్ కోరీ గార్డనర్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల రాయబారి సంధుతో మాట్లాడిన ఆయన.. ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని సవాళ్లను సంయుక్తంగా ఎదురుకోవడంపై చర్చించారు.

చైనా బెదిరింపులకు ఏమాత్రం జడిసేది లేదని భారత్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని మరో సెనెటర్ మార్కో రుబియో పేర్కొన్నారు. కాంగ్రెస్(పార్లమెంట్) సభ్యులు జార్జి హోల్డింగ్, బ్రాడ్ షెర్మన్, ప్రమీలా జయాపాల్, రో ఖన్నాలు సంధుకి లేఖలు రాశారు. గల్వాన్​లో జరిగిన ఘర్షణపై విచారం వ్యక్తం చేశారు.

ప్రధానికి లేఖ..

చైనా దూకుడుకు వ్యతిరేకంగా భారత్​ చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు వారాల క్రితం లేఖ రాశారు సెనెటర్ రిక్ స్కాట్. ఈ పోరులో అమెరికా నుంచి పూర్తి మద్దతు ఉంటందని లేఖలో పేర్కొన్నారు స్కాట్. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రతీ మిత్రదేశానికి అమెరికా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు.

కీలక నేతల ఆందోళన

భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని సెనెట్​ మెజారిటీ లీడర్ మిచ్ మెక్​కానెల్ తప్పుబట్టారు. ఎల్​ఏసీలో డ్రాగన్ దూకుడుపై విదేశీ వ్యవహారాల పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ ఎలియట్ ఎంగెల్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

చట్టాలతో..

రాజా కృష్ణమూర్తి నేతృత్వంలోని సభ్యుల బృందం నేషనల్ డిఫెన్స్ అథారైజేషన్ యాక్ట్​(ఎన్​డీఏఏ)కి సవరణ ప్రతిపాదన చేసింది. సభ్యుల ఆమోదం పొందిన ఈ చట్టం.. వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్తతలను దౌత్య మార్గంలోనే పరిష్కరించుకోవాలని చైనాకు సూచిస్తుంది.

ఇదీ చదవండి: కరోనా రికార్డ్: ఒక్కరోజులో 57 వేలకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.