భారత్ నుంచి కొవిడ్ టీకా డోసులను సాయంగా అందుకున్న కెనడా తన కృతజ్ఞతను చాటుకుంది. గ్రేటర్ టొరంటోలోని బిల్బోర్డ్స్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ ప్రకటనలను ప్రదర్శించింది. భారత్, కెనడాల మైత్రి బంధం సుదీర్ఘకాలం కొనసాగాలని పేర్కొంది.
తమ దేశానికి కొవిడ్ టీకాలు అందించాలని గతనెలలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. మోదీకి ఫోన్ చేసి కోరారు. ఈ మేరకు గతవారంలో 50,000 డోసుల కొవిషీల్డ్ టీకాను ఆ దేశానికి భారత్ సరఫరా చేసింది.
ఇదీ చూడండి: 'కొన్నేళ్లల్లో కరోనా పుట్టుకపై క్లారిటీ'